చూడు చూడు ,మబ్బులు ఎంత బావున్నాయో !
మబ్బుల్ని ఎప్పుడూ చూడలేదా ?
హ్మ్ !
మబ్బుల్ని ఎప్పుడూ చూడలేదా ?
హ్మ్ !
ఒక్క మబ్బులు విషయమనే కాదు,ఏ విషయం లో అయినా ప్రకృతి ఆరాధకులు,అనారాధకులు మధ్య జరిగే సంభాషణ ఇంచుమించు ఇలానే ఉంటుంది :)
పావురాలే కాదు ,మేఘాలతో కూడా సందేశాలు పంపించొచ్చు . ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రధముడు. (మేఘ సందేశం )
ఇక సినిమా ల విషయానికి వస్తే ,మేఘాల ప్రస్తావనతో కూడిన పాటలు ఎన్నో !
ఆకాశ వీధిలో హాయిగా అంటూ భానుమతి
ఓహో ,మేఘమాల అంటూ సావిత్రి
నీలి మేఘమా ,జాలి చూపుమా అంటూ చంద్రకళ
మేఘమా దేహమా అంటూ సుహాసిని
మేఘమా నీలి మేఘమా అంటూ సుమలత
తమ మనసు లోని భావాలు /విన్నపాలు మేఘాలకే విన్నవించుకున్నారు .
విషాదమే కాదు ,ఆనందం కూడా ...
మేఘాలలో తేలిపోమ్మన్నది
మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా ...
ఇక ఇలా రాసుకుంటూ పొతే లిస్టు చాంతాడంత అవుతుంది .
అలాగే సామెతలు ...
మబ్బుల్లో నీటిని చూసి ముంత వొలకపోసుకున్నట్లు
మన కథలు/కావ్యాలు/నవలల్లో కూడా మబ్బుల్ని రకరకాలు గా వర్ణించారు
వెండి తో ఒకరు పోలిస్తే (వెండిమబ్బులు ) మరొకరు దూది పింజలతో ... మీగడ తరకలు ,కారు మబ్బులు వగైరా వగైరా
కుక్కపిల్ల ,అగ్గిపుల్ల ,సబ్బు బిళ్ళ - కాదేదీ కవితకు అనర్హము అన్నారు ఓ కవి . అలాగే కబుర్లు కి కూడా . ప్రతీ దాని గురించి అనర్ఘళం గా కబుర్లు చెప్పుకోవచ్చు
కుక్కపిల్ల ,అగ్గిపుల్ల ,సబ్బు బిళ్ళ - కాదేదీ కవితకు అనర్హము అన్నారు ఓ కవి . అలాగే కబుర్లు కి కూడా . ప్రతీ దాని గురించి అనర్ఘళం గా కబుర్లు చెప్పుకోవచ్చు
No comments:
Post a Comment