Sunday, 19 June 2016

గర్వించదగ్గ క్షణాలు



కొన్నేళ్ల క్రితం ... 
కాలేజ్ లో డిగ్రీ ఆఖరి సంవత్సరం క్లాస్ 
మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి అని లెక్చరర్ గారి ప్రశ్నకు , ఒక్కొక్కరు సమాధానమిస్తున్నారు . 
అమ్మాయిల వంతు వచ్చింది 
వారు చెప్తున్న సమయం లో ... 
అబ్బాయిల వైపు నుంచి ... ఏముంది ,పెళ్లి చేసుకుని ,ఇంట్లో వంట చేసుకుంటాము . క్లర్క్ అవుతాను . టీచర్ అవుతాను అని కమెంట్స్ ... ఆ వెనుకే ఇకఇకలు  పకపకలు 

కొద్దిరోజుల క్రితమే ఒకరు కామెంట్ చేశారు 
ఆడవాళ్లు, టీచర్,క్లర్క్  ఉద్యోగాలను మాత్రమే చెయ్యగలరు అని . వేరే రంగాలలో ఉన్నా ,అతి కొద్దీ మంది మాత్రమే .రక్షణ రంగం లో అస్సలు చెయ్యలేరు , యుద్ధాలు చెయ్యలేరు ... 

నవ్విన నాపచేను పండుతుందని సామెత 

వాయుసేన లో తొలిసారి గా ముగ్గురు మహిళలు ఫైటర్ పైలట్ లు నియమించబడ్డారు . 

గర్వించదగిన విషయం 
ముందు ముందు వీరి సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాము .