కొన్నేళ్ల క్రితం ...
కాలేజ్ లో డిగ్రీ ఆఖరి సంవత్సరం క్లాస్
మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి అని లెక్చరర్ గారి ప్రశ్నకు , ఒక్కొక్కరు సమాధానమిస్తున్నారు .
అమ్మాయిల వంతు వచ్చింది
వారు చెప్తున్న సమయం లో ...
అబ్బాయిల వైపు నుంచి ... ఏముంది ,పెళ్లి చేసుకుని ,ఇంట్లో వంట చేసుకుంటాము . క్లర్క్ అవుతాను . టీచర్ అవుతాను అని కమెంట్స్ ... ఆ వెనుకే ఇకఇకలు పకపకలు
కొద్దిరోజుల క్రితమే ఒకరు కామెంట్ చేశారు
ఆడవాళ్లు, టీచర్,క్లర్క్ ఉద్యోగాలను మాత్రమే చెయ్యగలరు అని . వేరే రంగాలలో ఉన్నా ,అతి కొద్దీ మంది మాత్రమే .రక్షణ రంగం లో అస్సలు చెయ్యలేరు , యుద్ధాలు చెయ్యలేరు ...
నవ్విన నాపచేను పండుతుందని సామెత
వాయుసేన లో తొలిసారి గా ముగ్గురు మహిళలు ఫైటర్ పైలట్ లు నియమించబడ్డారు .
గర్వించదగిన విషయం
ముందు ముందు వీరి సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాము .
No comments:
Post a Comment