అక్టోబర్ 13న - బెంగళూరు ఎక్స్ప్రెస్ ,కాచిగూడ రైల్వే స్టేషన్ సాయంకాలం ఏడింటికి ప్రయాణం . అంతకుముందు రోజు , ఆ ట్రైన్ 2 గంటలు ఆలశ్యం అని చూసి,ఇవాళ ఎన్ని గంటలు ఆలశ్యం అవుతుందో అనుకున్నాను కానీ , సరి అయిన సమయానికే బయలుదేరింది.
గమ్యం చేరటం - నాలుగు గంటలు ఆలశ్యం .
బెంగళూరు నుంచి మైసూర్ చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది.మా టూర్ ఆపరేటర్ ,బాగా ఆలశ్యం అయ్యింది -ముందు లంచ్ చెయ్యండి ,తర్వాత రూమ్స్ అలాట్ చేస్తాను అని చెప్పటం తో , లంచ్ కి వెళ్ళాము.లంచ్ అయినా తర్వాత రూమ్ కీస్ ఇచ్చి ,4:30 కల్లా అందరు బస్ దగ్గర ఉండాలి అని చెప్పారు. ఒక పావు గంట రెస్ట్ తీసుకుని ,స్నానాదులు కానిచ్చి అందరం బస్ దగ్గరికి వెళ్ళాము.మొదట మైసూర్ ప్యాలెస్ కి వెళ్లి ఆ తర్వాత చాముండేశ్వరి అమ్మవారిని చూడటానికి వెళ్ళాము.ప్యాలెస్ బయటనుంచి చూడటానికి పెద్ద బాగోకపోయినా (లైట్స్ లేకుండా - లైటింగ్ తో బాగానే ఉంది అనుకోండి )లోపల చాలా అద్భుతం గా ఉంది.చాముండి హిల్స్ పైకి వెళ్లేప్పుడు ,విద్యుద్దీప కాంతులతో సిటీ , ఎంతో అందం గా కనిపించింది.తప్పక చూడాల్సిన దృశ్యం. అమ్మవారిని దర్శించుకుని తిరిగి హోటల్ చేరుకున్నాము.డిన్నర్ సమయం లో మరుసటి రోజు ప్రోగ్రామ్ చెప్పారు.మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ అదీ ముగించుకుని రిసెప్షన్ దగ్గరికి చేరుకున్నాము. బస్ రావటానికి టైం పడుతుంది , రూమ్స్ కి వెళ్ళండి,బస్ వచ్చినాక పిలుస్తాము అనటం తో రూమ్ కి వెళ్ళిపోయాము.9:30 కి బయలు దేరుతాము అన్నవాళ్ళు 11, 12 గంటలు అయినా, పిలుపు లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్లు ,బస్ -రిపేర్ కి వెళ్ళింది,ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పారు.ఎలా అయితే ఏం,వేరే ఆరెంజ్మెంట్స్ చేసి కుక్కేకి బయలుదేరాము.సాయంకాలం 7:30 కి కుక్కే చేరుకున్నాము. హోటల్ నుంచి ఆటో లో గుడికి చేరుకున్నాము. దర్శనానికి - క్యూ చాలా పెద్దగా ఉంది.క్యూ లో నించోకుండా,అక్కడ ఉన్న పూజారిగారిని అడిగి డైరెక్ట్ గా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆరు గంటల కల్లా రెడీ అయ్యి ,మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. గుడి వెనక చెట్టు, కొండా , మంచులో -తడిసి ముద్దవుతూ ... చూడటానికి రెండు కళ్ళు చాలవు అనిపించింది.
పురాణ కథల ప్రకారం ,తారక,శూర పద్మాసుర అనే రాక్షసులను యుద్ధం లో చంపిన తర్వాత ,సుబ్రహ్మణ్య స్వామి కుమార పర్వతం చేరుకున్నాడంట.ఇంద్రుడు ఆనందంతో తన కుమార్తె దేవసేన ను వివాహం చేసుకోవాల్సింది గా కోరాడట.స్వామి పెళ్లికి అంగీకరించటం తో ,కుమార పర్వతం వద్ద పెళ్లి జరిగింది. వివాహసమయంలో దేవతలు వివిధ పవిత్ర నదులనుంచి తెచ్చిన జలాలతో చేసిన అభిషేకం వల్ల కుమార ధార నది ఏర్పడిందట. గుడికి కొద్ది దూరం లో కుమార ధార నది ఉంది . ఈ నది లో స్నానం చేస్తే , వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం.

2 comments:
interesting description. well taken pic .
Thank you for liking the post Arbinda :)
Post a Comment