ఉడిపి నుంచి గోకర్ణ ,మహాబలేశ్వర్ గుడికి వెళ్ళాము.ఈ గుడిని కదంబ వంశానికి చెందిన మయూరశర్మ 4వ శతాబ్దంలో నిర్మించాడు.కాళిదాసు రచించిన రఘువంశలో గోకర్ణ ప్రసక్తి ఉందట.ఉందట,అని ఎందుకన్నాను అంటే రఘువంశము నేను చదవలేదు 😊 మహాబలేశ్వరుడుని, గణపతి ని తామ్ర గౌరిని దర్శించుకుని మురుడేశ్వర్ వెళ్ళాము .
పురాణ గాథల ప్రకారం , రావణాసురుడి తల్లి పూజించే శివలింగాన్ని ఇంద్రుడు తస్కరించి సముద్రంలో కి విసిరేశాడట.రావణాసురుడు , కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు.ఇచ్చిన మాట ప్రకారం కైలాసానికి వెళ్లి తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆత్మ లింగాన్ని ఒక షరతు తో పొందాడు.ఆ షరతు - గమ్యం చేరేవరకు నేలపై పెట్టకూడదు. దేవతలు ,ఆ శివలింగాన్ని రావణాసురుడికి దక్కకుండా చెయ్యటానికి వినాయకుడుని గోవులకాపరి వేషంలో పంపిస్తారు.విష్ణువు సూర్యాస్తమయం అయినట్లు భ్రమింపచేస్తాడు. సంధ్యావందనం చేసుకోవాలని , రావణాసురుడు బాలుని వేషం లో ఉన్న వినాయకుడికి శివలింగాన్ని పట్టుకోమని ఇచ్చి తాను వచ్చెంతవరకు నేలపై పెట్టవద్దని చెప్తాడు.వినాయకుడు రావణాసురుడిని మూడుసార్లు పిలిచి,రావణాసురుడు వచ్చేలోపే నేలపై పెట్టాడు.కోపంతో ఆ బాలుని తలపై మొట్టాడు అంట.గోకర్ణ లో ఉన్న వినాయకుడి విగ్రహం,మాడు అణిగి ఉంటుంది. ఆ శివలింగాన్ని పెకలించటానికి ప్రయత్నించినా రాలేదు.5ప్రదేశాలలో ముక్కలు పడ్డాయట.అవి మురుడేశ్వర్ ,సజ్జేశ్వర్,దారేస్వర్,గుణవంతేశ్వర్.వీటిలో గోకర్ణ కాకుండా మురుడేశ్వర్ ఒకటి దర్శించుకున్నాము.ఈ కథ అంతా,మానవ నిర్మిత గుహ (భూకైలాష్ గుహ)మురుడేశ్వర్లో బొమ్మల రూపం లో ఉంది.

మురుడేశ్వర్
ఈ ఆలయ గోపురం 18 అంతస్తులు , లిఫ్ట్ లో వెళ్ళొచ్చు.
గోపురం పై నుంచి వ్యూ