Tuesday, 30 January 2018

పద్మావతిపద్మావతి సినిమా చూసాను.కర్ణిసేన అంతలా గోల చెయ్యాల్సిన అవసరం ఏమిటో తెలియదు.అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమి నాకు కనిపించలేదు.సింహళ దేశపు బౌధ్ధ మతాన్ని అనుసరించే  రాజకుమారి వేటకు వెళ్ళడం ... బాహుబలి కుంతల రాజకుమారి ప్రభావం దర్శకుని మీద ఉందనుకుంటా 😀 వాస్తవానికి  పద్మావతి దగ్గర మాట్లాడే చిలుక ఉండేదంట.ఆ చిలుక తప్పిపోతే,దానిని వెతుకుతూ వెళుతుంటే రతన్ సింగ్ కలుస్తాడట. రతన్ సింగ్ పాత్రకు షాహీద్ కపూర్ కాకుండా ఇంకెవర్నయినా తీసుకోవాల్సింది.షాహీద్ ఆ పాత్రకు సూట్ అవలేదు. రన్వీర్ సింగ్  నటన అద్భుతం.  

కర్ణి సేన  ఈ సినిమా విడుదల ను ఎందుకు అడ్డుకుంటుంది అనేదానికి ఎవరికి వారు , రకరకాల కారణాలు చెపుతున్నారు. టైమ్స్ నౌ  న్యూస్ లో శ్రీజు సుధాకరన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడ  చదవొచ్చు