చండీఘర్ అంటే ఒక ప్లాన్డ్ నగరం, రాక్ గార్డెన్ ఉంది అని మాత్రమే తెలుసు.అంతకు మించి ఏమీ తెలియదు.అక్కడకు వెళ్లిన తర్వాతే చాలా విషయాలు తెలిసాయి. ఆ నగరాన్ని ప్లాన్ చేసిన వ్యక్తి ,అతను వేసిన పెయింటింగ్స్ చూసాము. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కంపల్సరీ గా సందర్శించే రెండు ప్రదేశాలు- Le Corbusier సెంటర్ capitol complex ( 2016 లో యునెస్కో వర్ల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి వచ్చింది )
Le Corbusier సెంటర్ లో Le Corbusier వేసిన పెయింటింగ్స్, అతను గీసిన సిటీ, బిల్డింగ్ ప్లాన్ లు భద్రపరిచారు. నాకు అవి అంత ఆసక్తికరం గా అనిపించలేదు. మోడర్న్ ఆర్ట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి నచ్చుతాయేమో/ అర్ధమవుతాయి అనుకుంటా :)
capitol complex లో అసెంబ్లీ ,సెక్రటేరియట్, హైకోర్ట్ , ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ ఉన్నాయి.శని,ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో లోపలి వెళ్లి చూడొచ్చు అని చెప్పారు. మేము ఆదివారం వెళ్ళటం వల్ల బయటనుంచి చూసి వచ్చేశాము .
No comments:
Post a Comment