Zone diet : Dr. Barry Sears ఈ డైట్ ని డిజైన్ చేశారు. ఈ డైట్ లో కూడా పిండి పదార్ధాలు తక్కువ తీసుకోవాలి.
పిండి పదార్ధాలు,కొవ్వు పదార్ధాలు,ప్రోటీన్ 40:30:30 రేషియో లో తీసుకోవాలి.
4 నుంచి ఆరు గంటల గ్యాప్ తో ఆహారం తీసుకోవాలి.
ప్రొద్దున్నే నిద్ర లేచిన గంట లోపు అల్పాహారం(low fat protein) తీసుకోవాలి.ఆ తర్వాత రెండు గంటలకు,లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్ధాలు ( కూరగాయలు, పళ్ళు) తీసుకోవచ్చు.రోజు మొత్తం లో 2 లీటర్ల నీళ్లు తాగాలి.3 మీల్స్,2 స్నాక్స్ తీసుకోవాలి.ప్రతి మీల్ ,స్నాక్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
కీటోజెనిక్ డైట్ : ఇది ఇంచుమించు అట్కిన్స్ డైట్ లాంటిదే.పిండి పదార్ధాలు తగ్గించి, కొవ్వు పదార్ధాలు ఎక్కువ తీసుకోవటం.ఈ రకమైన డైట్ వలన కీటోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాము కదా.ఈ కీటోన్స్ ఎక్కువ మొత్తం లో ఏర్పడితే శరీరానికి హానికరం.
ఉపయోగాలు:తాత్కాలికంగా బరువు తగ్గటం,మంచి కొలెస్ట్రాల్ పెరగటం,డయాబెటిస్ కంట్రోల్.
ఈ డైట్ ను దీర్ఘకాలికం పాటించటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్,అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ & ఒబేసిటీ సొసైటీ-
కీటోజెనిక్ డైట్( లో కార్బోహైడ్రేట్ డైట్) గుండెకు మంచిదని చెప్పటానికి తగినన్ని ఆధారాలు లేవు అని పేర్కొన్నాయి.
వెజిటేరియన్ డైట్ : ఇందులో మళ్ళీ రకరకాల డైట్స్
లాక్టో -ఒవో వెజిటేరియన్స్ - అన్ని రకాల మాంసాహార పదార్ధాలు తినరు
Pescatarians - చేపలు తింటారు , ఇతర మాంసాహారం తినరు
లాక్టో వెజిటేరియన్స్ - పాలు,పాల నుంచి తయారయ్యే ఇతర ఆహార పదార్ధాలు తింటారు. గుడ్లు తినరు
ఒవో వెజిటేరియన్స్ - పాలు,పాల నుంచి తయారయ్యే ఇతర ఆహార పదార్ధాలు తినరు. గుడ్లు తింటారు.
వేగన్స్ - జంతువులకు సంబంధించిన ఎటువంటి ఆహార పదార్ధాలు , తేనెతో సహా తినరు.
మాంసాహారం తీసుకునే వారికంటే శాఖాహారులు బరువు తక్కువ గా ఉన్నారని నిరూపణ అయ్యింది.శాఖాహారం తీసుకోవటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.
వెజిటేరియన్ డైట్ పాటించటం వలన విటమిన్ డి ,బి 12,ఇనుము, కాల్షియం,జింక్ లోపాలు వచ్చే అవకాశం ఉంది.శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యం గ్యారంటీ అనలేము.ఎటువంటి డైట్ ఫాలో అయినా, జంక్ ఫుడ్,రీఫైన్డ్ ఫుడ్స్, ఎక్కువ కాలరీలున్న ఫుడ్స్ తింటే అనారోగ్యం మన వెన్నంటే ఉంటుంది.
నెక్స్ట్ పోస్ట్ లో ఇంకొన్ని డైట్స్ ...