ఒకప్పటి కాలం లో తిండి మీద ఇప్పుడున్నంత ధ్యాస ఉండేది కాదేమో. ఈ మధ్య కాలం లో తరచూ డైట్ అనే మాట వింటూ ఉన్నాము.లావు తగ్గాలా? అయితే ఈ డైట్ ఫాలో అవ్వండి.కొలస్ట్రాల్ తగ్గాలా ...ఈ డైట్ ఫాలో అవ్వండి.ఆరోగ్యకరమైన జీవితానికి ... ఈ డైట్ ఫాలో అవ్వండి.మెడిటరేనియన్ డైట్ ఫాలో అయితే షుగర్ కంట్రోల్ అవుతుంది ... వగైరా వగైరా.
బాగా పాపులర్ అయినా డైట్స్ కొన్ని ...
అట్కిన్స్ డైట్
ఈ డైట్ లో ఫాట్ ,ప్రోటీన్ ఫుడ్స్ ఎంతైనా తినొచ్చు. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. ఈ డైట్ ని ,హృద్రోగ నిపుణులు డా. అట్కిన్స్ డిజైన్ చేశారు.
ఈ డైట్ లో 4 దశ లు ఉన్నాయి
మొదటి దశలో రోజుకి 20గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకోవాలి.అది కూడా ఆకుకూరలు, కూరగాయల ద్వారా లభించేవి మాత్రమే.
రెండో దశ లో పీచు పదార్ధాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్ - నట్స్ , తక్కువ పరిణామం లో పండ్లు
వీటిని మొదటి వారం లో 25 గ్రాములు , రెండవ వారం లో 30 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండాలి.బరువు తగ్గటం ఆగిపోయేవరకు అలా తీసుకుంటూ,బరువు తగ్గటం ఆగి పోయాక మళ్ళీ బరువు తగ్గటం మొదలయ్యేవరకు రోజుకు 5 గ్రాములు పిండి పదార్ధాలు తగ్గించుకుంటూ ఉండాలి.
మూడో దశ లో రోజుకు ఒక 10గ్రాములు పిండిపదార్ధాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి
నాలుగో దశ - జీవిత కాల నిర్వహణ
తినదగిన ,తినకూడని ఆహార పదార్ధాలు
అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్స్,కోడిగుడ్లు ,బ్రోకలీ, ఆకుకూరలు,నట్స్ ,ఆలివ్ నూనె ,కొబ్బరి నూనె ,కాఫీ , గ్రీన్ టీ తీసుకోవచ్చు
పంచదార , తీపి పదార్ధాలు ,శనగలు,చిక్కుళ్లు ,లెగ్యుమ్ జాతికి చెందినవి ఏవి తీసుకోకూడదు.
మొదటి దశలో అరటి పళ్ళు,యాపిల్స్ ,ద్రాక్ష పళ్ళు తినకూడదు.
ఈ డైట్ ఎంతవరకు సఫలమయ్యింది ?
ఈ డైట్ అనుసరించిన వారు బరువు తగ్గటం సాధించొచ్చు కానీ,ఎక్కువ మంది మధ్యలోనే వదిలెయ్యటం జరుగుతుంది.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గమనించిన విషయం ... బ్లడ్ ప్రెషర్ ,కొలెస్ట్రాల్ లెవెల్స్,బరువు తగ్గటం , మిగతా డైట్స్ తో పోలిస్తే అట్కిన్స్ డైట్ మెరుగ్గా ఉందని.దీనిని నిర్ధారించటానికి ఇంకా పరిశోధనలు చెయ్యాల్సి ఉంది.
ఈ డైట్ ఫాలో అయ్యే మొదటి రోజుల్లో తలనొప్పి,మైకం,నిస్త్రాణం,మలబద్ధకం లాంటి కొన్ని దుష్ప్రభావాలు గమనించారు. పిండిపదార్ధాలు తక్కువ తీసుకోవటం వలన,శక్తి కోసం శరీరం లోని కొవ్వు పదార్ధాలు ఉపయోగించినందువల్ల కీటోన్స్ ఏర్పడుతాయి.కీటోన్స్ ప్రభావమే .. దుష్ప్రభావాలు
షుగర్ వ్యాధి ,కిడ్నీ వ్యాధి ఉన్నవారు,గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు ఈ డైట్ ను అనుసరించ కూడదు .
నెక్స్ట్ పోస్ట్ లో ఇంకో డైట్ గురించి
సౌజన్యం : medicalnewstoday
No comments:
Post a Comment