సౌత్ బీచ్ డైట్ : ఈ డైట్ ను Dr.Agatston (హృద్రోగ నిపుణులు)Marie Almon (పోషకాహార నిపుణులు) రూపొందించారు.ఈ డైట్ ముఖ్యం గా ఇన్సులిన్ లెవెల్స్ ని తగ్గించటం మీద దృష్టి పెట్టబడింది.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమర్ధించిన " లో ఫాట్ - హై కార్బ్ " డైట్ పట్ల అసంతృప్తి/ నిరాశ చెందిన Dr.Agatston 1990 లో ఈ డైట్ ను రూపొందించారు.
ఈ డైట్ లో మూడు దశలు ఉంటాయి
మొదటి దశలో చాలా వేగం గా బరువు తగ్గుతారు. ఇది 2 వారాలు చెయ్యాల్సి ఉంటుంది
తినదగిన ఆహార పదార్ధాలు - అన్ని రకాల మాంసాహారం,గుడ్లు,నట్స్, కూరగాయలు,సోయా పన్నీరు.
బ్రెడ్,వరిఅన్నం,బంగాళాదుంపలు,పాస్తా,తీపిపదార్ధాలు,పళ్ళు,మద్యం తీసుకోకూడదు.
రెండో దశ లో ... ఎంత బరువు తగ్గాలి అనుకుంటారో అది సాధించేవరకు పాటించాలి.ఈ దశ లో నెమ్మది గా ఒక్కో పిండి పదార్ధాన్ని ఆహారం లో చేర్చుకుంటు ఉండాలి.శరీరంలో ఏమయినా మార్పులు ఉంటే గమనించి, ఒకవేళ పిండి పదార్ధాలు సరిపడకపోతే మళ్ళీ కొన్నాళ్ళు మొదటి దశ ను పాటించి రెండో దశకు రావాల్సి ఉంటుంది. అనుకున్న బరువు చేరుకున్నాక మూడో దశ ... ఈ దశ లో అన్ని రకాల ఆహార పదార్ధాలు మితం గా తీసుకుంటూ బరువు పెరగకుండా , తగ్గకుండా చూసుకోవాలి
రా(పచ్చి /ముడి ఆహారం) ఫుడ్ డైట్ : పేరు తోనే తెలిసిపోతుంది కదా, ఏమి తినాలో !
పళ్ళు,పచ్చికూరగాయలు,మొలకలు,ఎండు(డ్రైడ్)పళ్ళు(బాదాం,పిస్తా,జీడిపప్పు,etc.,)గుడ్లు,చేపలు...
వండిన లేదా ప్రాసెస్డ్ ఆహరం ,రీఫైన్డ్ నూనె ,పంచదార,ఉప్పు,కాఫీ,టీ ,మద్యం ... తీసుకోకూడనివి
మెడిటరేనియన్ డైట్ :ఈ డైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నది ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది.ఈ డైట్లో ఎక్కువగా కూరగాయలు ,పళ్ళు,నట్స్,మాంసాహారం మితం గా తీసుకోవచ్చు.వంటల్లో ఆలివ్ నూనె ,అవకాడో నూనె వాడాలి.స్వీట్స్ కూడా మితం గా తినొచ్చు.
ఇంకా చాలా రకాల డైట్ లు ఉన్నాయి కానీ అవన్నీ ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. ఇప్పటి వరకు చూసిన డైట్స్ లో కామన్ గా ఉన్నది ఏంటంటే ... ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. తాజా కూరగాయలు ,పళ్ళు తినాలి. ఖచ్చితంగా ఫలానా డైట్ అనుసరించాలి అని కాకుండా మన శరీరానికి ఏది సరిపడుతుందో అది తింటే మంచిది. ప్రతి ఒక్క డైట్ తోనూ లాభాలు ఉన్నాయి,నష్టాలు ఉన్నాయి.పిండి పదార్ధాలు తక్కువ తీసుకుని కొవ్వు పదార్ధాలు ఎక్కువ తీసుకున్నా ,లేదా ఇవి రెండు తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా...ఏదైనా ప్రమాదమే ! అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.
కావున ఏ డైట్ ఫాలో అవ్వాలి అని ఎక్కువ ఆలోచించకుండా ,ప్రాసెస్డ్ ఫుడ్స్,ప్యాక్డ్ ఫుడ్స్ మానేసి పిండి పదార్ధాలు,కొవ్వు,ప్రోటీన్ సమతులంగా ఉన్న తాజా ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment