అక్టోబర్ 8 , చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ కి ప్రయాణం. సాయంత్రం 4గంటల ప్రాంతం లో చేరుకున్నాము. రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి నగరం లో ఆలా ఒక రౌండ్ వేసి వచ్చాము.
మేము బస చేసిన దగ్గరలోనే 1943 పార్క్( flag point ) ఉంది.
మొట్టమొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ ఇక్కడ మువ్వన్నెల పతాకం ఎగరవేశారు. అండమాన్ & నికోబార్ బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిందని డిక్లేర్ చేసారు. బ్రిటిషర్లు అండమాన్ వదిలి వెళ్లినాక జండా ఎగర వేశారు. తిరిగి అక్టోబర్ 1945 లో బ్రిటిష్ అండమాన్ ను ఆక్రమించింది. 1947 వరకు వారి ఆధీనం లోనే ఉంది.
No comments:
Post a Comment