నేస్తం......
ఎన్నో ఊసులు-నీతో చెప్పాలనుకుంటాను
ఏవో సందేహాలు-నను వెనక్కు లాగుతుంటాయి
చెప్పాలనుకున్న ఊసులన్నీఊహలుగానే మిగిలిపోతాయి

ఇసుకతో కట్టిన గూళ్ళు అల తాకగానే కరిగిపోయినట్లు ,
ఇహలోకం లోకి రాగానే ఊహలు మాయమవుతాయని తెలుసు
అయినా ఆ ఊహల్లోని ఆనందం ,నన్ను నిజాన్ని గుర్తించనివ్వటం లేదు
ఊహలు ఎంత మధురం గా ఉన్నా,వాస్తవం లోకి రాక తప్పదు

ఆ చేదు ని రుచి చూడక తప్పదు
అందుకే ఊహలు ఎప్పటికి నిజమవ్వవని మనసుకు తెలిసినా,
కనులు తెరిచి నిజాన్ని చూడటానికి నిరాకరిస్తున్నాను .