Thursday, 29 July 2010

కోపం

తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతక కర్త.కోపం వలన నష్టం తప్పించి ,లాభం ఏమీ ఉండదని తెలిసినప్పటికీ ,జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు కోపం తో చిందులు వేయని వారు ఉండరేమో.కోపం గురించి నాకు నచ్చిన quotes కొన్ని.

Holding  on to anger is like grasping a hot  coal  with the intent of throwing it at someone else;you are the one who gets burned-Buddha

Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured.

Anger is only one letter short of 'Danger'.

Anger blows out the lamp of the mind-Robert Green Ingersoll

Temper tantrums ,however fun they may be to throw,rarely solve whatever problem is causing them.-Lemony Snicket 

To carry a grudge is like being stung to death by one bee -William.H.Walton

Sunday, 25 July 2010

Foodles


నిన్న మా అమ్మాయి స్కూల్లో ఇచ్చారని foodlesప్యాకెట్ ఒకటి తీసుకు వచ్చింది. సేమ్, నూడుల్స్   లాగానే ఉన్నాయి.కాకపొతే నూడుల్స్ ని గోధుమ పిండి తో తయారు చేస్తే ఈ ఫూడుల్స్ ని గోధుమ పిండి,వరిపిండి,రాగి,మొక్కజొన్న పిండులతో తయారు చేశారు.ఆ ప్యాకెట్ ని చూడగానే నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది.నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ,మా స్కూల్ లో maggiపాకెట్స్ ఇచ్చారు.ఒక్కో స్టూడెంట్ కు రెండు పాకెట్స్ ఇచ్చారు.వాటిని ఇంటికి తీసుకు వెళ్లి మా అమ్మ కు ఇస్తే ,వాటిని ఎలా వండాలో నాకు తెలియదు అంది.ప్యాకెట్ మీద ఎలా తయారు చేయాలో రాసి ఉంది ,నేను వండుతాను అని ఎంతో శ్రద్దగా చదివి నూడుల్స్ ను వండాను.చిన్న బౌల్స్ లో సర్ది అందరి కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను.మాకు ఎవరికి నూడుల్స్ నచ్చలేదు.అందరం ఒక స్పూన్ కంటే ఎక్కువ తినలేకపోయాము.అంతా బయటికి తీసుకు వెళ్లి పారవేసాము.సరే నేను తెచ్చిన రెండు పాకెట్స్ వండి అలా పారబోసాము.మా తమ్ముడు కిచ్చిన రెండు పాకెట్స్ ని ఏమి చెయ్యాలా అని ఆలోచించి ,సేమియా లాగానే ఉన్నాయి కాబట్టి పాయసం చేసుకుందాము అని మా అమ్మకు సలహా ఇచ్చాను.మా అమ్మ నూడుల్స్ తో పాయసం చేసింది.సేమియా పాయసం లాగా టేస్ట్ గా లేకపోయినా,తియ్యగా ఉంది కాబట్టి ఎలాగో అలాగా బలవంతాన తాగేసాము.అప్పుడు,అసలు తినటానికి ఇష్టపడని వాళ్లము ...ఇప్పుడు ఎంతో ఇష్టం గా తింటున్నాము.ఇడ్లి,దోశ చేస్తే వాటిల్లోకి చట్ని చేయాలి.చపాతీ నో ,పూరి నో అయితే కూర వండాలి.ఈ బాధ లేమి లేకుండా ,నూడుల్స్ అయితే రెండు నిమిషాల లో చేసేసుకోవచ్చు.మనమే చేయాలని లేదు.పిల్లలయినా తయారు చేసేసుకోవచ్చు.నేను నెలవారీ సరకులు తెచ్చేటప్పుడే ,రెండు డజన్లు నూడుల్స్ పాకెట్స్ తీసుకు వస్తాను.వంట చేయటానికి బద్దకించి నప్పుడు  నూడుల్స్  జిందాబాద్.ఫూడుల్స్ ,నూడుల్స్  అంత టేస్ట్ గా లేకపోయినా పరవాలేదు,తినొచ్చు.

Friday, 23 July 2010

మునగాకు-పోషక విలువలు


జ్యేష్ట మాసపు ఎండల తరువాత వచ్చే ఆషాడపు జల్లులకు శరీరం లో ముఖ్యం గా ఉదరం లో జీర్ణ ప్రక్రియలో జరిగే మార్పులకు మునగాకు మేలు చేస్తుందని ,ఆషాడ మాసం లో మునగాకు తప్పక  తినాలని అంటారు.అయితే ఒక్క ఆషాడం లోనే కాదు,ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం.

మునగాకులో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు,(కాల్షియం,ఫాస్ఫరస్,ఇనుము,పొటాషియం )విటమిన్ 'A ','C' ఎక్కువగా ఉన్నాయి.

మునగాకుల  లో కాల్షియం ఎక్కువ గా ఉంటుంది కనుక ,మునగాకు రసం ఒక చెంచాడు ..కప్పు పాల లో కలిపి పిల్లలకు రోజూ తాగిస్తుంటే ఎముకలు దృడం గా ఉంటాయి. 

గర్భిణులకు .....కప్పుడు పాలలో రెండు స్పూన్ల ములగాకు రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగితే రక్త హీనత,కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

మునగాకు లో ఉన్న పొటాషియం వల్ల మెదడు ,నరాలు చక్కగా పనిచేస్తాయి.
విటమిన్ 'A ','C' వల్ల ఉపయోగాలు అందరికి తెలిసినవే.


Wednesday, 21 July 2010

Garbage Truck Psychology

మన మూడ్ ఎక్కువ గా ఎదుటివాళ్ళు మనతో ప్రవర్తించే విధానం పైనే ఆధారపడి ఉంటుంది.మన బాస్ మనల్ని అకారణం గా తిట్టినా/విసుకున్నా ,ఎవరైనా మనతో దురుసుగా ప్రవర్తించినా ,వెంటనే మన మూడ్ పాడవతుంది.ఏ పని చేయబుద్ది అవదు.వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు అనే ఆలోచిస్తూ మన పనులు పాడు చేసుకుంటూ ఉంటాము.వాళ్ళు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్,కోపం,అసంతృప్తి అనే చెత్తను  మన మీద వేసి వదిలించుకుంటే మనం ఆ చెత్తను తీసి అవతల పారవేయాలా?లేదా ?ఆ చెత్తను పదిలంగా దాచుకోము కదా?అందుకని అలాంటి మనుషులు గురించి ఆలోచించి మన మూడ్ పాడు చేసుకోవటం మంచిది కాదు.వాళ్ళను పట్టించు కోకుండా ఉంటే మనం సంతోషం గా ఉంటాము అని తెలిపే ఈ కథ చదవండి.

How often do you let other people's nonsense change your mood?
Do you let a bad driver, rude waiter, curt boss, or an insensitive employee ruin your day? However, the mark of a successful person is how quickly one can get back their focus on what's important.

David J. Pollay explains his story in this way...

Sixteen years ago, I learned this lesson. I learned it in the back of a New York City taxi cab. Here's what happened. I hopped in a taxi, and we took off for Grand Central Station. We were driving in the right lane when, all of a sudden, a black car jumped out of a parking space right in front of us. My taxi driver slammed on his breaks, skidded, and missed the other car's back end by just inches!

The driver of the other car, the guy who almost caused a big accident, whipped his head around and he started yelling bad words at us. My taxi driver just smiled and waved at the guy. And I mean...he was friendly. So, I said, "Why did you just do that? This guy almost ruined your car and sent us to the hospital!"

And this is when my taxi driver told me what I now call, "The Law of the Garbage Truck."

"Many people are like garbage trucks. They run around full of garbage, full of frustration, full of anger and full of disappointment. As their garbage piles up, they need a place to dump it. And if you let them, they'll dump it on you. When someone wants to dump on you, don't take it personally. You just smile, wave, wish them well, and move on.

You'll be happy you did." I started thinking, how often do I let Garbage Trucks run right over me? And how often do I take their garbage and spread it to other people: at work, at home, on the streets? It was that day I said, "I'm not going to do it anymore."

Life's too short to wake up in the morning with regrets. Love the people who treat you right. Forget about the ones who don't. Believe that everything happens for a reason.

Never let the garbage truck run over you...

మరి మీరేమి చేస్తారు?వేరే వాళ్ళ చెత్తను మీరు క్యారీ చేస్తారా?వదిలించుకుంటారా? 

Monday, 19 July 2010

సక్సెస్

జీవితం లో సక్సెస్ అనేది కొంతమంది నే వరిస్తుంది.మరి మిగతా వాళ్ళు సక్సెస్ కాకపోవటానికి కారణం ఏమిటి?జనరల్ గా మనం అనుకునేదేమిటంటే సక్సెస్ అవటానికి కారణం వాళ్ళు అదృష్టవంతులు అవటం ,కాకపోవటానికి దురదృష్టం కారణం అని.నిజం గా అదృష్టం ,దురదృష్టం అనేవి ఉంటాయా?ప్రయత్నలోపం వల్ల కూడా సక్సెస్ సాదించలేకపోవచ్చు కదా?ఫెయిల్ అవుతామన్న భయం వల్ల అసలు ప్రయత్నమే చేయకపోవచ్చు.
Many of  life's failures are people who didnot realize how close they were to success when they gave up-Thomas Edison.

A winner is someone who recognizes his god given talents,works his tail off to develop them into skills and uses these skills to accomplish his goals-
Larry bird

Efforts may fail.But don't fail to make efforts.Great things will always come late.There is no shortcut to success,only way is hardwork

Our doubts are traitors,and make us lose the good we often might win,by fearing to attempt-William Shakespeare

One reason so few of us achieve,what we truly want is that we never direct our focus.We never concentrate our power.Most people dabble their way through life,never deciding to master anything in particular-Anthony Robins.

ఫలానాది సాధించాలన్న కోరిక ఉన్నంత మాత్రాన అది సాధించలేము.ఎలాగైనా సాధించాలి అన్న తపన ఉంటేనే సాధించగలం.
Desire is the starting point of all achievements,not hope,not a wish,but a keen pulsating desire which transcends everything-Napoleon hill

అలాగే, ఏదో ఒకటి సాధించాలని కాకుండా ఖచ్చితమైన లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే సాదించగలము.
 
People with goals succeed,because they know where they are going.
 
సక్సెస్ కాకపోవటానికి ,90 % ప్రతీ దానికి excuses వెతికే మనస్తత్వమే కారణం .
90%of the failures come from people who have the habit of making excuses-George Washington Carver


Tuesday, 13 July 2010

విందుభోజనం

ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు.చదివినాక నిజంగా జరిగిందా అని కూడా అనిపించవచ్చు.ఎవరైనా నాకు చెప్పితే నేను నమ్మేదాన్ని కాదేమో కానీ ,ఆ పరిస్థితి నాకే ఎదురైంది కాబట్టి ,ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మక తప్పటం లేదు.
మేము అద్దె కుండే ఇంట్లో మొత్తం నాలుగు పోర్షన్ లు ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు,ఫస్ట్ ఫ్లోర్ లో రెండు.గ్రౌండ్ ఫ్లోర్ లో,సునీత,వాణి వాళ్ళు అద్దె కుంటే , ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్ ,ఇంకొక దాంట్లో మేము ఉండేవాళ్ళము.సునీత వాళ్ళది ప్రేమ వివాహం.పెళ్ళికి పెద్ద వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ,అంతస్తుల తేడా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ వాళ్లకు,అత్తగారి వాళ్లకు సరిపడేది కాదు.వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు
వాళ్ళ అత్తగారు వాళ్ళు,వీళ్ళ ఇంటికివచ్చేవారుకాదు. అలాగేవాళ్ళ అమ్మావాళ్ళు ఉన్నప్పుడు అత్తగారువాళ్ళువచ్చేవారుకాదు.సునీతవాళ్ళపాపకు ఆరో నెల .అన్నప్రాసన చేయటానికి మంచిరోజు చూసుకున్నారు.
మా కాంపౌండ్ లో వారిని,పక్కింటి వారిని మాత్రమే పిలుస్తున్నానని చెప్పింది. ఏమన్నా గొడవ జరిగితే బాగోదుఅని ఎక్కువ మందిని పిలవటం లేదని చెప్పింది. సరే అన్నప్రాసనకు వెళ్ళాము.

ఆ కార్యక్రమం అవగానే పాపను నిద్ర పుచ్చటానికని సునీత ,వెనకాలే వాళ్ళ అమ్మ,అత్తగారు,వాళ్ళ తరపు బంధువులు అందరూ లోనికి వెళ్లారు. గెస్ట్ లం హాల్ లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.కడుపు లో ఎలుకలు పరిగెత్తే వరకు ఎవరికీ భోజనం సంగతి గుర్తుకు రాలేదు.టైం చూస్తే ఒకటిన్నర అయ్యింది.ఏమిటి ,వీళ్ళు ఇంకా భోజనానికి పిలవలేదు,నేను లోనికి వెళ్లి కనుక్కొని వస్తాను ఉండండి అని మా ఇంటి ఓనర్ గారు లోనికి వెళ్ళారు.విషయం ఏమిటంటే.........పాతిక,ముప్పై మందికంటే ఎక్కువ అవరు కదా ,ఇంట్లో నే వంట చేయోచ్చు లే అనుకుందట సునీత.అయితే వాళ్ళ అమ్మ ఏమో,నేను వంట చేస్తే మీ అత్తగారు వాళ్ళు కూర్చొని తింటారా?నేను చేయను అందట.వాళ్ళ అత్తగారు ఏమో అమ్మాయి తరపు వాళ్ళు,మీరు చేయకపోతే,మేము చేస్తామా?మేము చేయం అందట.ఎంత బతిమాలినా ఇద్దరు ససేమిరా అని మొండికేసారంట .నేను డయాబెటిక్ ని.నెమ్మదిగా తల నెప్పి స్టార్ట్ అయ్యింది.వాళ్ళు ఎప్పుడు రాజీకొస్తారో,ఏమిటో నండీ,నేను ఇంటికివెళ్లి ఏమన్నా లేకపోతే పడిపోయే లాగున్నాను అని అక్కడనుంచి వచ్చేసాను.మా పిల్లలిద్దరికి బాక్స్ లో పెట్టగ మిగిలిన అన్నం కొంచం ఉంటె అది తిన్నాను.(భోజనానికి వెళుతున్నాను కదా అని నాకు వండుకోలేదు)రెండు అయ్యింది.శివయ్య సీరియల్ చూద్దామని టి.వి.పెట్టాను.ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.ఎవరా అని చూస్తే మా ఇంటి ఓనర్.వాళ్ళు ఎవరూ కదిలే లాగా లేరండి.వాణి గారు మనమే చేద్దాం అన్నారు ,మీరు కూడా రండి అని పిలిచారు.కుక్కరు, బాండి,కత్తిపీట తీసుకు రండి,నేను కూడా మావి తీసుకు వెళుతున్నాను అన్నారు.వంట చేయటం అంటే నాకు పరమ చిరాకు.ఇంట్లో తప్పదు కాబట్టి ,ఎలాగో వండాను అనిపిస్తాను.ఇప్పుడు హాయిగా సీరియల్ చూద్దామనుకుంటే ,ఇదేమి కర్మరా బాబు అనుకుంటూ ,ఆవిడ చెప్పిన సరంజామా అంతా తీసుకుని వెళ్ళాను.మొత్తానికి వంట చేసి ,గెస్ట్ లు మయిన మేము హోస్ట్ లు గా మారి,మా హోస్ట్ లకు ముందు వడ్డించి ,వారు తిన్న తరువాత ,మేము కూడా తిని ఇంటికి చేరాము.

Wednesday, 7 July 2010

బంద్ చేస్తే ధరలు తగ్గుతాయా?

నిన్న ,నేను సరుకులు తెచ్చుకోవటానికి షాప్ కు వెళ్ళాను.అప్పుడే ఒక ఆవిడ monthly కార్డు(పాలు) కు డబ్బులు పే చేయటానికి వచ్చింది.ఎనిమిది వందలు ఇచ్చి కార్డు తీసుకుని చిల్లర కోసం నుంచుంది.షాప్ అతను డబ్బులు  సరిపోయాయి అని అన్నాడు. ఏడు వందల అరవయ్యి కదా ,ఎనిమిది వందలు తీసుకున్నారేంటి ?అని అడిగింది.పాల రేటు పెరిగిందమ్మ అన్నాడు షాప్ అతను.దానికి ఆమె... నిన్ననే కదా షాప్ బంద్ చేయిన్చినాము ,రేటు తగ్గించాలి కానీ ,ఎలా  పెంచుతావు అని అడిగింది.దానికి షాప్ అతను రేటు తగ్గటం కాదు,ఎన్ని సార్లు బంద్ చేయించితే అన్ని సార్లు రేట్లు పెరుగుతాయి అని అన్నాడు.ఆవిడ,మరి రేట్లు తగ్గనప్పుడు బంద్ చేయడం దేనికి?అన్నది. ఆమె అడిగిన తీరు కు నాకు నవ్వు వచ్చింది కానీ ,ఎలాగో నవ్వకుండా ఆపుకున్నాను.ఒక్క క్షణం ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.ఆవిడ అంటే సాధారణ గృహిణి,పెద్దగా చదువుకోలేదు,కాబట్టి బంద్ చేస్తే ధరలు తగ్గుతాయనే భ్రమ లో ఉండవచ్చు.కానీ ప్రతిపక్ష నాయకులకు ఏమయ్యింది?వాళ్ళకూ అలాంటి  భ్రమలు ఉన్నాయా?ఏమాశించి ఈ బంద్ లు జరుపుతున్నారు?ధరలు పెరిగితే ఏమి చెయ్యాలో మేము చూసుకుంటాము,మీరు మా కోసం బంద్ లు నిర్వహించక్కరలేదు ,అని ప్రజలు నాయకులకు చెప్పే రోజు వస్తుందా? 

Saturday, 3 July 2010

హెల్త్ చెకప్

జనరల్ గా మనందరమూ వ్యాధి బాగా ముదిరిన తరువాత ,ఇక వెళ్ళక తప్పదు కాబట్టి డాక్టర్ దగ్గరకు వెళతాం.అంతే కానీ, ముందు జాగ్రత్త గా ఏలాంటి కేర్ తీసుకోము.రొటీన్ చెకప్ లాంటివి  అసలు చేయించుకోము.కాన్సర్ లాంటి జబ్బులు ,ఎర్లీ స్టేజి లోనే గుర్తిస్తే ,జబ్బు పూర్తి గా నయమవటానికి అవకాశం ఉంది.కుటుంబం లో ఎవరికైనా గుండె జబ్బులు,మధుమేహం,కాన్సర్,పక్షవాతం లాంటివి ఉన్నట్లయితే ,మిగతా కుటుంబ సభ్యులు తప్పకుండ ఈ క్రింద పేర్కొన్న టెస్ట్ లు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి.అలాంటి జబ్బుల హిస్టరీ లేనివాళ్ళు కూడా టెస్ట్లు చేయించుకుంటే మంచిది.

బ్లడ్ ప్రషర్,కొలస్ట్రాల్:సంవత్సరానికి ఒకసారి......20సం.నిండిన ప్రతి ఒక్కరు

బ్లడ్ గ్లూకోజ్ :సంవత్సరానికి ఒకసారి......45 సం.నిండిన ప్రతి ఒక్కరు
  

కళ్ళు:సంవత్సరానికి ఒకసారి

డెంటల్ :ఆరు నెలల కు ఒకసారి

బోన్ డెన్సిటి :రెండు సంవత్సరాలకి ఒకసారి 55 సం.నిండిన స్త్రీలు ,60 సం.నిండిన పురుషులు.

మామ్మోగ్రాం:సంవత్సరానికి ఒకసారి......40  సం. నిండిన స్త్రీలు

పాప్ స్మియర్ :సంవత్సరానికి ఒకసారి.....21 సం.నిండిన స్త్రీలు

ప్రోస్టేట్: సంవత్సరానికి ఒకసారి......50 సం.నిండిన  పురుషులు.ఫ్యామిలీ హిస్టరీ (ప్రోస్టేట్ కాన్సర్)ఉన్నవాళ్లు 40 వ సం. నుంచి టెస్ట్ చేయించుకోవాలి.