నిన్న ,నేను సరుకులు తెచ్చుకోవటానికి షాప్ కు వెళ్ళాను.అప్పుడే ఒక ఆవిడ monthly కార్డు(పాలు) కు డబ్బులు పే చేయటానికి వచ్చింది.ఎనిమిది వందలు ఇచ్చి కార్డు తీసుకుని చిల్లర కోసం నుంచుంది.షాప్ అతను డబ్బులు సరిపోయాయి అని అన్నాడు. ఏడు వందల అరవయ్యి కదా ,ఎనిమిది వందలు తీసుకున్నారేంటి ?అని అడిగింది.పాల రేటు పెరిగిందమ్మ అన్నాడు షాప్ అతను.దానికి ఆమె... నిన్ననే కదా షాప్ బంద్ చేయిన్చినాము ,రేటు తగ్గించాలి కానీ ,ఎలా పెంచుతావు అని అడిగింది.దానికి షాప్ అతను రేటు తగ్గటం కాదు,ఎన్ని సార్లు బంద్ చేయించితే అన్ని సార్లు రేట్లు పెరుగుతాయి అని అన్నాడు.ఆవిడ,మరి రేట్లు తగ్గనప్పుడు బంద్ చేయడం దేనికి?అన్నది. ఆమె అడిగిన తీరు కు నాకు నవ్వు వచ్చింది కానీ ,ఎలాగో నవ్వకుండా ఆపుకున్నాను.ఒక్క క్షణం ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.ఆవిడ అంటే సాధారణ గృహిణి,పెద్దగా చదువుకోలేదు,కాబట్టి బంద్ చేస్తే ధరలు తగ్గుతాయనే భ్రమ లో ఉండవచ్చు.కానీ ప్రతిపక్ష నాయకులకు ఏమయ్యింది?వాళ్ళకూ అలాంటి భ్రమలు ఉన్నాయా?ఏమాశించి ఈ బంద్ లు జరుపుతున్నారు?ధరలు పెరిగితే ఏమి చెయ్యాలో మేము చూసుకుంటాము,మీరు మా కోసం బంద్ లు నిర్వహించక్కరలేదు ,అని ప్రజలు నాయకులకు చెప్పే రోజు వస్తుందా?
1 comment:
SARI AINA AALOCHANA
Post a Comment