Friday 23 July 2010

మునగాకు-పోషక విలువలు


జ్యేష్ట మాసపు ఎండల తరువాత వచ్చే ఆషాడపు జల్లులకు శరీరం లో ముఖ్యం గా ఉదరం లో జీర్ణ ప్రక్రియలో జరిగే మార్పులకు మునగాకు మేలు చేస్తుందని ,ఆషాడ మాసం లో మునగాకు తప్పక  తినాలని అంటారు.అయితే ఒక్క ఆషాడం లోనే కాదు,ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం.

మునగాకులో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు,(కాల్షియం,ఫాస్ఫరస్,ఇనుము,పొటాషియం )విటమిన్ 'A ','C' ఎక్కువగా ఉన్నాయి.

మునగాకుల  లో కాల్షియం ఎక్కువ గా ఉంటుంది కనుక ,మునగాకు రసం ఒక చెంచాడు ..కప్పు పాల లో కలిపి పిల్లలకు రోజూ తాగిస్తుంటే ఎముకలు దృడం గా ఉంటాయి. 

గర్భిణులకు .....కప్పుడు పాలలో రెండు స్పూన్ల ములగాకు రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగితే రక్త హీనత,కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

మునగాకు లో ఉన్న పొటాషియం వల్ల మెదడు ,నరాలు చక్కగా పనిచేస్తాయి.
విటమిన్ 'A ','C' వల్ల ఉపయోగాలు అందరికి తెలిసినవే.


No comments: