కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసా.ఎదురుగా మా కాలనీ వాళ్ళందరూ కనిపించారు.ఏమయ్యింది ,కట్ట కట్టుకుని అందరూ ఒకసారే వచ్చారు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఒక చిరునవ్వు విసిరా.అందరూ దణ్ణాలు పెట్టుతూ అను గారు ,మీరు దేవత,మమ్మల్ని ఈ దరిద్రపుగొట్టు సినిమా ల బారి నుంచి రక్షించటానికి వచ్చిన దేవత అన్నారు.మనసులో ఉప్పొంగిపోతూ పైకి మాత్రం అమాయక ఫేస్ తో నేను దేవత ఏమిటండీ,ఖలేజ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యిందా?అన్నాను.బ్లాక్ అవలేదు,వైట్ అవలేదు కానీ మీరు మా దేవత,దేవత అని కోరస్ పలికారు.ఊ...మీరు ఇన్నిసార్లు నన్ను దేవత అంటుంటే నాకు నిజమేనేమో అని అనిపిస్తుంది.రావిచెట్టు కు పూలు పూయించాలా?మందార చెట్టుకు కాయలు కాయించాలా ?నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆవేశం గా అన్నాను.అవేమీ వద్దు కానీ ,సూర్య,త్రివిక్రమ్ అనే వాళ్ళు సినిమాలు డైరెక్ట్ చేయకుండా చేయండి చాలు అన్నారు.ఏంటీ?ఆ పని నేను చేయగలనా అని ఆశ్చర్య పోయాను.హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు ,మీకు మీ శక్తి తెలియట్లేదు తల్లీ ....మీరు అనుకోండి చాలు అంతే అయిపోతుంది అన్నారు వాళ్ళు.సరే అని అనుకున్నాను.వెంటనే t .v 9 లో బ్రేకింగ్ న్యూస్ అని 'సూర్య,త్రివిక్రం ఇక నుంచి డైరెక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని 'ఫ్లాష్ చేసాడు.హా!నిజంగా నాకు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్య పడెంతలో...ఢాం అని పెద్దగా శబ్దం వినిపించి ఉలిక్కిపడి ఇహలోకం లోకి వచ్చాను.అయ్యో ఇదంతా ఊహేనా,నిజం అయితే ఎంత బాగుండు అనిపించింది.
ఖలేజాలో మహేష్ కొత్తగా కాదు ,పరమ చెత్తగా నటించాడు.బూతు డైలాగులు వల్లించటమే కొత్తదనం అనుకుంటున్నారు ....డైరెక్టర్ ,హీరో లు.అనూష్క కారెక్టర్,సినిమా లో లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు.పరమ వేస్ట్ ,చీము,నెత్తురు లేని డంబ్ కారెక్టర్ .ఈ సినిమా చూడాలంటే చూసిన తరువాత కలిగే వికారాలను తట్టుకునే ఖలేజా,ముందుమనకుఉండాలి.ఈ సినిమా చూస్తే,టైం,మనీ ,
మైండ్ ...పోవటం ఖాయం.
2 comments:
now you comment on DOOKUDU movie please.......
మహేష్ కుమార్ గారు,
దూకుడు సినిమా నేను చూడలేదండి.సో కామెంట్ చేయలేను.
Post a Comment