Thursday, 23 December 2010

జీవితం


జీవితం ఓ హిమసాగరం
సమస్యల సూర్యకిరణాలు తాకితే
కరిగి తల్లడిల్లుతుంది ఘోషగా
సుఖాల మలయపవనాలు వీచినప్పుడు
నిశ్చల మనోప్రాంగణంలో ప్రశాంతంగా నిదురిస్తుంది.
*************************************
జీవితాన్ని ఎంతో మంది ఎన్నో విధాలు గా నిర్వచించారు.సినీ కవులు జీవితాన్ని పోరాటం ,ఆట,దీపావళి తో పోల్చారు.దేనికదే సరైన నిర్వచనం అనిపిస్తుంది.జీవితం గురించి నాకు నచ్చిన  'Quotes' కొన్ని.

.*  Life is a rope that swings us through hope.

* Like a rose,Life was meant to have its thorns.Let the beauty  of     the rose inspire you,don't let the thorns discourage you. 

* Life is not a problem to be solved,but a gift to be enjoyed. 


Life is like Piano
the white keys represent happiness
and black shows sadness
but as you go through life's journey
remember that the black keys too make music

We grow old filled with regrets for things not done,for words not said,for love not shown,for dreams not completed.Life is short,Act today.Do all that makes you happy now.

జీవితం ఎంతో చిన్నది కదా!మరి దాన్ని సద్వినియోగపర్చుకోండి.

Laugh when you can
Apologize when you should
Let go off what you can't change
Forgive quickly
Take chances&have no regrets

Tuesday, 21 December 2010

మా పిల్లల తెలుగు


ఆడుకోటానికి వెళ్ళిన మా అమ్మాయ్,అమ్మా అన్నం చేసావా?ఆకలేస్తుంది అంటూ వచ్చింది.అన్నం చేసావా ఏంటి?ఏం భాష అది?అన్నం వండావా   అనాలి అన్నాను నేను.
ఆ...అదేలే చేసావా?మా అమ్మాయి.
మళ్ళీ అదే మాట...నేను
ఏదోలే అమ్మా ,నాకు అన్నం పెట్టు ఆకలి గా ఉంది అంది మా అమ్మాయి.
ఏం బాష,ఆ....అదేలే,ఏదోలే ఈ టైపు సంబాషణ మా ఇంట్లో ప్రతి రోజూ మాక్జిమం ఎన్నిసార్లో చెప్పలేను కానీ మినిమం ఒక్కసారైనా వుంటుంది.
నా జుట్టులు ఊడిపోతున్నాయి,ఏదో ఒకటి చెయ్యమ్మా అంటుంది.
జుట్టులు కాదు.......వెంట్రుకలు అనాలి అని నేను అంటే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అన్నట్లు  ఆ...అదేలే అని మా అమ్మాయి రొటీను సమాధానం.
పెరుగు కొంచం పులిసినట్లున్నా ఈ పెరుగు కుళ్లిపోయింది, నాకొద్దు అంటుంది.
కూరగాయలు,పళ్ళు అయితే కుళ్ళిపోయాయి అంటారు,పెరుగు పులిసిపోయింది అనాలి అని నేనంటే తన రొటీన్ డైలాగ్ వదులుతుంది.
పెరుగు వేసేటప్పుడు కొత్తదా,పాతదా అని అడుగుతుంది.
పెరుగు కొత్తదా,పాతదా ఏంటే,నీ బాష తో నన్ను చంపుతున్నావు-నేను
తన దృష్టిలో కొత్తది అంటే మధ్యాహ్నభోజనం లోకయితే పొద్దున్న తోడుపెట్టినది,రాత్రి భోజనం లోకి అయితే మధ్యాహ్నం తోడుబెట్టినది . ముందు రోజు తోడుపెట్టినది అయితే పాత పెరుగు.ఆ పెరుగు వేసుకోదన్నమాట.
మా అమ్మాయి మాటలు ఇలా ఉంటే ,మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ప్రతి దానికి దొరికింది అనే మాట వాడుతుంది.
మచ్చుకు కొన్ని......
నాకు రన్నింగ్ రేస్ లో సెకండ్ ప్రైజ్ దొరికింది.
ఇవాళ సాకేత్ బర్త్డే ,అందరికీ ఒక చాక్లేటే,నాకు రెండు చాక్లెట్లు దొరికాయి.
నేను విన్నప్పుడు సరిచేస్తూ ఉంటాను.
ఒకరోజు స్కూల్ నుంచి  నాకు రోప్ దొరికిన్దంటూ వచ్చింది.రోప్ దొరకటం ఏమిటి?ఎక్కడ దొరికింది అని అడిగాను నేను.అమ్మ ఫిఫ్టీన్రూపీస్ ఇచ్చిందా,టెన్ రూపీస్ కి ఈ రోప్ దొరికింది.
బాడ్జ్ ఫైవ్ రూపీస్,బాడ్జ్ దొరకలేదు ,అందుకని చాక్లెట్ కొనుక్కొని తిన్నాను అంది.డబ్బులు పెట్టి 
కొనుక్కున్నావు కదా,రోప్ కొనుక్కున్నాను అనాలి,
దొరికిందని అనకూడదు అని చెప్పాను. అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ని సప్పోర్ట్ చేస్తాడు.వాళ్ళ అమ్మాయి మాటలన్నీ కరక్టే అంటాడు.హిందీ లో ప్రైజ్ మిలా అంటారు,అంటే దొరికిందనే కదా అర్ధం.ప్రైజ్ వచ్చిందన్నా ,దొరికిన్దన్నా ...ఏదైనా కరెక్టే అని వాదిస్తాడు.సరే వాళ్ళ నాన్నే అలా మాట్లాడుతుంటే ,ఇంక ఆ అమ్మాయి ఏమి నేర్చుకుంటుందిలే అని నేను వదిలేసాను.దేవుడి ని వేడుకుంటున్నాను.......నేను తెలుగు మర్చిపోవటమో, మా పిల్లలు సరైన తెలుగు మాట్లాడటమో ...ఈ రెండిటి లో ఏదో ఒకటి చేయమని.ఈ రెండిటి లో మొదటి కోరిక  నేరవేర్చటమే దేవుడికి కూడా ఈజీ అనుకుంటా.

Sunday, 12 December 2010

సంక్రాంతి

డిసెంబర్-16సంక్రాంతి నెల మొదలు.పండగలన్నింటి లోకి నాకు సంక్రాంతి పండగ అంటే చాలా ఇష్టం.దసరా,వినాయకచవితి,శ్రీరామనవమి లాంటి పండగలు వారం రోజులపాటు సందడి చేస్తే ,సంక్రాంతి పండగ కు మటుకు నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.ఇప్పటి రోజుల గురించి కాదు,మా చిన్నప్పటి సంగతి.ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడాకళా,కాంతికోల్పోయింది.నెలపట్టినరోజునుంచిసంక్రాంతిప్రత్యేకముగ్గులు
గొబ్బెమ్మలు,వాటిపైనబంతిపూలతోవాకిళ్ళుకళకళ,హరిదాసులు,గంగిరెద్దులవాళ్ళు,బుడబుక్కలవాళ్లు,కాబూలివాళ్ళు వస్తే వాళ్లకు బియ్యం వెయ్యటానికి....మాచెల్లెళ్లలతోపోటిపడటం ,అరిసెలు వండుతుంటే...బెల్లం పాకం కోసం...ప్లేట్ లోనీళ్ళు పోసుకుని ఎదురు చూడటం,చలిమిడి కోసం...నాకు ముందు అంటే నాకు ముందు అని గోల చెయ్యటం,వండిన అరిసెలను గడ్డి పై ఆరబెట్టటానికిపరుగులు పెట్టటం,  
పరుగులుపెడుతూనే,ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది అన్న అమ్మమ్మ మాటలు లెక్కచేయకుండా  అందులో కొన్ని అరిసెలను స్వాహా చెయ్యటం, ధాన్యపుబస్తాలనే ప్లే గ్రౌండ్ గాచేసుకుని ఆటలుఆడటం,భోగి మంటలు .....అవిఅన్నీ గుర్తుకు వస్తే,ఆదిత్య 369సినిమా లో లాగా టైం మెషీన్ ఒకటి దొరికి అప్పటి రోజులలోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోవాలని ఉంది.

Wednesday, 8 December 2010

వాడిన గులాబీ

ఈ రోజు ఓ పుస్తకం తిరగేస్తుంటే కనిపించింది.
 వాడిపోయి,ఎండిపోయిన ఓ గులాబీ
దాన్ని చూడగానే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి
   ఒకప్పుడు అది మంచి రంగులో ఉండేది.
దాని అందం ప్రాతః కాలపు మంచు లా ఉండేది
అది ఒకప్పుడు  నువ్వు ,నాకు పంపిన గులాబీయే
ఇప్పుడు పుస్తకంలో రంగు పోయి,ఎండిపోయి ఉంది.
నా హృదయం బాధతో విలవిలలాడుతోంది
 మూగగా రోదిస్తుంది.
ఎర్ర రోజాపుష్పాల బొకేలో "ఫర్ సం ఒన్ స్పెషల్ "
అని రాసున్న ట్యాగ్ పట్టుకుని వచ్చింది.



ఇప్పుడు ఒంటరి గా వాడిపోయి ఉంది.
చనిపోయిన ప్రేమకు సాక్ష్యంగా .



ఆ గులాబీ ని ఎప్పటికి దాచుకుంటాను,ఎందుకంటే
ప్రేమ మళ్ళీ నా గుండె తలుపు తట్టినప్పుడు
ఇంతకు ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా
హెచ్చరిస్తూ ఉంటుందని  

ఇంగ్లిష్ లో చదివిన ఒక పోయం నచ్చి ఇలా తెలుగు(మక్కీ కి మక్కీ అనువాదం కాదు కానీ)  లో రాసాను.ఎలా ఉంది?

Saturday, 4 December 2010

ఆడవాళ్ళమండి,చాలా గొప్పవాళ్ళ మండి


అమ్మ చెప్పినట్లు వదిన చేయకపోతే ,అమ్మ ను వదిన గౌరవించటం లేదు,సరిగా చూడటం లేదు అంటాం,అదే మన అత్తగారు మనకేమైనా సలహా ఇస్తే పాటించకపోగా,అన్నిట్లోనూ ఈవిడ జోక్యం చేసుకుంటుంది అనుకుంటాము.
అన్న వదినను   అపురూపంగాచూసుకుంటే,పెళ్ళాం   కొంగుపట్టుకుతిరుగుతున్నాడు,పెళ్ళాంవచ్చాక తల్లి,తోబుట్టువులు పనికిరాని
 వారై పోయారు  అంటాం,మన శ్రీవారు మాత్రం వాళ్ళ వాళ్లకు ప్రాముఖ్యం ఇవ్వకుండా ,మన మాట వింటూ మన చుట్టే తిరగాలి.
కోడలు తెచ్చిన కట్నం చాలలేదని రాచి రంపాన పెడతాము,మన అమ్మాయిని మాత్రం అత్తవారి ఇంట్లో బాగా చూడాలి అనుకుంటాము.
అందరూ ఆడవాళ్లే,కానీ ఏ ఇద్దరినీ సమానంగా చూడలేము.
పిల్లలు లేని వాళ్ళను గొడ్రాలు అని అవమానిస్తాం.భర్త చనిపోయిన స్త్రీ పొద్దున్నే కనిపిస్తే ,పొద్దున్నే దీని మొహం చూడాల్సి వచ్చిందని వాపోతాం.
పెళ్ళైనవాడని తెలిసినా ...అతనినే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకో ఆడదాని జీవితం లో కలతలు రేపుతాం.
సాటి ఆడవారు అని అయినా చూడకుండా అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తాం.
డబ్బుల కోసం ....సినిమాలలో,అడ్వర్ టైజ్మెంట్లలో అంగాంగ ప్రదర్శనలు చేస్తాం,పొట్టకూటి కోసమని సమర్ధించుకుంటాం.
మగవాళ్ళ దౌర్జన్యాలగురించి ప్రశ్నిస్తాము కానీ,మనసాటివారి మీద మనమే చేస్తున్న  దౌర్జన్యాల గురించి,వారిని పెట్టే మానసిక హింస గురించి ఎవరం మాట్లాడం.ఎందుకంటే మనం ఆడవాళ్ళం ,గొప్పవాళ్ళం కదా !

హైదరాబాద్ లో కన్నతల్లే తన ముగ్గురు కుమార్తెలతో బలవంతం గా వ్యభిచారం చేయిస్తుందన్న వార్త చూసిన తరువాత...ఇలా రాయాలని
అనిపించింది.