Saturday 27 August 2011

మనకు నచ్చినట్లు ఉండటం సాధ్యమేనా?

 జిందగీ నా మిలేగి దుబారా.అవును నిజమే !జీవితం అన్నది ఒక్కసారే లభిస్తుంది.రెండోసారి దొరకదు.(అఫ్ కోర్స్ పునర్జన్మలు అనేవి ఉంటే మళ్ళీ మళ్ళీ దొరుకుతుందను కొండి.)సరే!జీవితం ఒక్కసారే లభిస్తుంది కాబట్టి ...జీవితాన్ని ఆస్వాదించాలి,అంటే అన్నీ మన మనసుకు నచ్చినవి,ఆనందాన్నిచ్చేవి మాత్రమే చేయాలి.అది ఎవరికైనా సాధ్యమా?చిన్న వయసులో ...జీవితానుభవం తక్కువ కాబట్టి నేను ఏమైనా చేయగలను,మీలాగా కాదు ..నాకు నచ్చిందే నేను  చేస్తాను ...ప్రతి ఒక్కరు ...ఇలా అని అనుకోవటం సహజం.జీవితంలోముందుకు వెళుతున్నకొద్దీ మనకు అర్ధమవుతుంది ...అవన్నీ భ్రమలే అని.

 నేను డిగ్రీ చదివేటప్పుడు మా లైబ్రేరియన్ మేడం ....ఎందుకమ్మా ఈ కోర్సు లో జాయిన్ అయ్యారు.
 ఒకవేళ జాబ్ వచ్చినా పెళ్ళయితే మానేయ్యాల్సిందే.రెగ్యులర్ B .sc కోర్స్ చెయ్యక అన్నారు.ఆవిడ
M .Swచదివారు.డెవలప్మెంట్ ఆఫీసర్ గా గవర్నమెంట్ జాబ్ చేసేవారు కాస్తా మ్యారేజ్ అవటం తో ఆ జాబ్ మానేసి లైబ్రరి సైన్స్ లో బాచిలర్స్ డిగ్రీ తీసుకుని మా కాలేజ్ లో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు.కారణం...డెవలప్మెంట్ ఆఫీసర్ గా ట్రావెల్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది,కాబట్టి అత్తగారింట్లో ఆ జాబ్ చేయటానికి ఒప్పుకోలేదు.అదే లైబ్రేరియన్ అయితే ఎక్కడకు కదలనవసరం లేదు.ఫిక్స్డ్ టైమింగ్స్ అని ....  

   నేను ,నా ఫ్రెండ్స్ గొప్పగా ....మీరు కాబట్టి మానేశారు మేడం ,మేము మీ ప్లేస్ లో ఉంటే మానే వాళ్ళం కాదు.నాకు ఈ జాబ్ అంటే ఇష్టం ,ఈ జాబే చేస్తాను అని చెప్పేదాన్ని అని అన్నాము.దానికి ఆవిడ ఇప్పుడు ఇలాగే మాట్లాడుతారు లేమ్మా ,నేను కూడా అలాగే అనేదాన్ని.ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది ,ఏమి చేస్తారో అని అన్నారు.అప్పుడు అలా వాదించాము కానీ ,తీరా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆవిడ బాటే పట్టాము.అంటే లైబ్రేరియన్స్ అయ్యామని కాదు.ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్న జాబ్ లకే పరిమితం అయ్యామని.

 జనాలలో పాతుకు పోయిన కొన్నిఅభిప్రాయాల వల్ల మనకు ఒక పాట నచ్చితే ఆ పాట నచ్చిందని చెప్పటానికి కూడా జంకాల్సి వస్తుంది,కొన్ని పరిస్థితులలో .ఏదో మాటల లో గులాబి సినిమా లోని 'మేఘాల లో తేలి పొమ్మన్నది'అనే పాట అంటే ఇష్టం అని అన్నాను.నా కొలీగ్ 'ఏమిటి మేడం,మీకు ఆ పాటంటే ఇష్టమా?'అని బోలెడు హా శ్చర్యాన్ని ప్రకటించేసింది.వినకూడని దేదో విన్నట్లు ముఖకవళికలు....దాంట్లో అంత వింత పడాల్సింది ఏముందో నాకు అర్ధం కాలేదు.ఏ నేను మనిషిని కాదా ,అంత ఆశ్చర్య పోతున్నావు అని అన్నాను.దానికి ఆవిడ అలా అని  కాదు మేడం,మీకు మ్యారేజ్ అయ్యింది కదా ,అలాంటి పాటలు ఇష్టం ఉండవు అనుకున్నాను...అని నసిగింది.ఒకటి ఇష్టపడటానికి,మ్యారేజ్ అవటానికి సంబంధం ఏమిటో ఇప్పటికి నాకు అర్ధం కాదు.

        నాకు ఫలానాది ఇష్టం అని చెప్పుకోవటానికే ఇబ్బంది పడే మనం, మనకు నచ్చినది చేయగలిగే ధైర్యం ఉంటుందా?మనకు ఇష్టం ఉన్నా ,లేకపోయినా సమాజం ఆమోదించిన మార్గం లోనే వెళ్ళటానికి మొగ్గు చూపుతాము.సమాజాన్ని ఎదిరించే ధైర్యం ఎంత మందికి ఉంటుంది?అలా కాదని సమాజాన్ని ఎదిరించి తమకు నచ్చినట్లు ఎంతమంది ఉండగలుగుతారు?ఉంటే, వాళ్ళు ..చుట్టూ ఉన్నవాళ్ళ కామెంట్స్ ని పట్టించు కోకుండాఆనందం గా ఉండగలుగుతారా?డౌటే !

4 comments:

శిశిర said...

అవునండి. బాగా చెప్పారు.

Anuradha said...

శిశిర గారు థాంక్యూ.

sunkojidevendrachari said...

chaala mandi batikedi poruguvaalla kosame., anduke chaala kashtalu.. tama kosame taamu jeeviste jeevitam chaala anandanga prasanthanga untundi

Anuradha said...

మీరు చెప్పింది నిజమే దేవేంద్ర గారు.కానీ మనల్ని మన లాగా ఉండనివ్వరు కదండీ...మన పొరుగువాళ్ళు!మీ కథల సంపుటి ఒకటి చదివానండి. కథలన్నీ చాలా బాగున్నాయి.నా బ్లాగ్ లో మీరు కామెంట్ రాసినందుకు చాలా ఆనందం గా ఉంది.ధన్యవాదాలు.