Thursday, 12 January 2012

మిగిలినవి జ్ఞాపకాలే!ఏవీ ఆ నవ్వుల గలగలలు ?
ఏవీ ఆ చెంగు చెంగున గెంతిన గంతులు?
ఏవీ  ఆ రేపటి కోసం కన్న కలలు?
ఏరీ జీవితం లో మాధుర్యం నింపిన ఆ స్నేహితులు?
కాల గమనం లో దిగులు నవ్వులను కప్పివేస్తే,
నైరాశ్యం కలలను కమ్మేసింది.
జీవిత పోరాట పయనం లో స్నేహితులు దూరమైతే...
ఇప్పుడు మిగిలినవన్నీ గత కాలపు తీపి జ్ఞాపకాలు మాత్రమే!


No comments: