Tuesday 5 June 2012

నేను కుట్లు నేర్చిన విధి విధానము

ఈ మధ్య తీరిక ఎక్కువై తీరిక సమయాన్ని ఎలా సద్వినియోగం  చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే ఎప్పుడో చదివిన విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటె బ్రెయిన్ చురుకు గా ఉండి  తొందరగా మతిమరుపు రాదంట.సరే ఏదో ఒకటి కొత్త విద్య నేర్చుకుందామని దగ్గరలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్లాను.

ఇన్స్టిట్యూట్ ఇంచార్జ్ గారు ఒక పామ్ప్లేట్ ఇచ్చారు,తాము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఇవి అంటూ.కంప్యూటర్ కోర్స్ .ఆల్రెడీ వచ్చు కాబట్టి అది కాన్సిల్.బ్యుటి షియన్ -బ్యూటి పట్ల పెద్ద ఆసక్తి లేదు సో అది కూడా కాన్సిల్.ఇక మిగిలినవి టైలరింగ్  ,ఫాషన్ డిజైనింగ్  .ఇంచార్జ్ గారిని రెండిటికి తేడా ఏమిటి అని అడిగాను.ఫాషన్ డిజైనింగ్ లో కొన్ని ఎక్కువ కుట్లు,డ్రెస్ లు నేర్పిస్తారు అని అన్నారు.నా గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ,ఎలాగు అన్ని ఎక్కువ కుట్లు,డ్రెస్ లు కుట్టటం మన వల్ల అయ్యే పని కాదులే అని టైలరింగ్ లో చేరతాను అని చెప్పాను.
సరే ఫీజ్ కట్టి ఒక శుభ ముహూర్తాన ఇన్స్టిట్యూట్ లో చేరాను.
ట్యూటర్ గారు ఏమేమి కొనుక్కోవాలో ఒక లిస్టు ఇచ్చారు.కావలసిన సరంజామా కొనుక్కుని క్లాస్ లకు వెళ్ళటం మొదలు పెట్టాను.క్లాస్ లో కుట్లు నేర్పించటం కంటే ఎక్కువ  అనవసరమైన సంబాషణలు .క్లాస్ రెండింటికి అయితే మా మేడం గారు తీరికగా 3 కో 4 కో వచ్చేవారు.వచ్చిన తరువాత ప్రొద్దున నుంచి తాను క్లాస్ తీసుకుని ఎంత అలసిపోయింది ఒక అరగంట చెప్పి ఆ తరువాత ఒక పది నిముషాలు క్లాస్ .మళ్ళీ సుత్తి...ఫలానా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో రెండు లక్షలు తీసుకుంటూ ఇవే నేర్పిస్తున్నారు,మీరేమో 500 కి 3000 కి నేర్చుకుంటున్నారు అని. లోన ఎంత కోపం ఉన్నా అందరం ఒక బ్రాడ్ స్మైల్ ఇచ్చి అలాగా మేడం,హి హి ...అని మేము.మా ట్యూటర్ గారి విషాద పలుకులు రోజూ విని విని మనసులోనే 500 కి నేర్చుకున్నా 3000 కి నేర్చుకున్నా నీకేమి బాధ తల్లీ నీ జీతం నీకొస్తుంది కదా అని బి.పి తెచ్చుకోవటం కామన్ అయిపొయింది.సరే నేర్చుకునే కష్టాలు ఎలా ఉన్నా మొత్తానికి నేర్చుకోవటం పూర్తి   చేసాము.



2 comments:

శ్రీలలిత said...

మీ అభిరుచికీ, ఆసక్తికీ అభినందనలండీ..

Anuradha said...

థాంక్యూ లలిత గారు .