ఎప్పటి నుంచో శిల్పారామం చూడాలని అనుకుంటున్నా వెళ్ళటం కుదరలేదు . పోయిన నెలలో శ్రీరామ నవమి రోజున మా తమ్ముడి వాళ్ళ పాప డాన్స్ ప్రోగ్రాం అక్కడ ఉండటం తో అనుకోకుండా వెళ్ళాము :)
ఎంట్రన్స్ మొదలులో సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత రాముల వారికి పూజా కార్యక్రమాలు జరుపుతుండటంతో అటు వెళ్లి దైవ దర్శనం చేసుకుని బయటకు రాగానే ... ఒక పక్కన, ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని వెళ్ళే వాళ్ళను వద్దు అన్నా ఆపి మరీ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆ ప్రసాదం భోజనానికి తక్కువ,టిఫిన్ కి ఎక్కువ అన్న టైప్ లో ఉంది .( 2 పూరీలు,బంగాళ దుంప కూరతో ,పులిహోర,రవ్వ కేసరి) సరే ప్రోగ్రాం మొదలు కావటానికి ఎలాగు టైం ఉంది కదా అని నెమ్మది గా ప్రసాదాన్ని ఆరగించి ,అటు ఇటు తిరుగుతూ కొన్ని ఫోటో లు తీసుకుని ప్రోగ్రాం స్థలానికి చేరుకున్నాము .
3 comments:
CHOODA CHAKKANI ANDAMAINA PRADESAM ,ANDARINI ALARIMPACHESI AHLADA PRADESAM .
Andamaina pradesam choodachakkani pradesam .
అవును ప్రమీల గారు.
Thank you for commenting :)
Post a Comment