Sunday, 16 February 2014

అస్సాం స్టేట్ మ్యూజియం

కళాక్షేత్ర తర్వాత చూడదగ్గది అస్సాం స్టేట్ మ్యూజియం.అస్సాం తెగల జీవన విధానాన్ని తెలిపే బొమ్మలు కళాక్షేత్రలో ఉన్నవి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి.తవ్వకాలలో బయల్పడ్డ 10 మరియు 13 వ శతాబ్దం నాటి శిల్పాలు ,రాగి నాణేలు ,రెండవ ప్రపంచ యుద్ధం లో వాడిన ఆయుధాలు ఇక్కడ చూడవచ్చు. ఒక రూం మొత్తం గాంధీ తాత కి కేటాయించబడింది. చిన్నప్పటి ఫోటో లు,పెళ్లి అయిన కొత్తలో కస్తూరిబా తో కలిసి దిగిన ఫోటో ,చనిపోయినప్పుడు ,వేరే నాయకులతో దిగిన ఫోటో లు ఉన్నాయి.గాంధీ గారు రాసిన ఉత్తరాలు,ఆయనకు ఇతరులు రాసిన ఉత్తరాలు కూడా ఇక్కడ చూడొచ్చు.అన్ని ఉత్తరాలు చదవలేదు ,చదివిన వాటిలో ఒకటి -  గాంధీ గారు విజయవాడ లోని ఒకరికి విడాకుల విషయమై సలహా ఇస్తూ రాసినది ఉంది.కొన్ని ఫోటోస్ తీయటానికి పర్మిషన్ లేదు ,పర్మిషన్ ఉన్నవాటిలో కూడా కొన్నే తీసాము . అక్కడ తీసిన కొన్ని ఫోటో లు . 

స్నేక్ పిల్లర్










    






Saturday, 15 February 2014

Itnaa na mujhse tu pyaar badhaa...



itnaa na mujhse tu pyaar badhaa, ke main ek baadal aawaaraa
kaise kisi kaa sahaaraa banoon, ke main khud beghar bechaaraa

Isliye tujhse main pyaar karoon, ke tu ek baadal aawaaraa
janam janam se hoon saath tere, hai naam meraa jal ki dhaaraa

mujhe ek jagah aaraam nahin, ruk jaanaa meraa kaam nahin
meraa saath kahaan tak dogi tum, mai desh videsh kaa banjaaraa

o neel gagan ke deewaane, tu pyaar na meraa pahchaane
main tab tak saath chaloon tere, jab tak na kahe tu main haaraa

kyun pyaar mein tu naadaan baney, ik paagal kaa armaan bane
ab laut ke jaana mushkil hai, maine chhod diya hai jag saara

Thursday, 13 February 2014

శ్రీమంత శంకర్ దేవ్ కళాక్షేత్ర

గౌహాతి వెళితే మిస్ కాకుండా చూడాల్సిన వాటిలో ఒకటి ఇది . అస్సాం ప్రజల సంస్కృతిని ,వివిధ తెగల జీవన విధానం ,డ్రెస్సింగ్ మరియు ఒకప్పుడు వారు వాడిన ఆయుధాలు ,వస్తువులు - భద్రపరచిన మ్యూజియం . అన్నీ ఫోటోలు తీయలేదు కానీ ,కొన్ని మీ కోసం :)
దూరం నుంచి చూస్తే ,నిజం గానే అక్కడ మనుషులు ఉన్నారేమో అన్నంత సజీవంగా ఉన్నాయి - చిత్రాలు/బొమ్మలు


పెళ్ళికొడుకు,పెళ్ళికూతురు





ట్రీ హౌస్ మోడల్

Thursday, 6 February 2014

కనులను తోచి చేతికందని ఎండమావులున్నాయి



కనులను తోచి చేతికందని ఎండమావులున్నాయి
కనులకు తోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం ...
సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం




Tuesday, 4 February 2014

నిండు నాలుగేళ్ళు



నిండు నూరేళ్ళు అని కదా అంటారు ,ఈ నాలుగేళ్ళు  ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ బ్లాగ్ మొదలెట్టి నాలుగేళ్ళు అయ్యింది.అదన్నమాట సంగతి. అసలు బ్లాగ్ మొదలు పెట్టింది ఊహలు-ఊసులు అనే పేరుతో . మొదటి పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది నెలలకు, పాపం నూకలు చెల్లి పోయాయి (జి మెయిల్ అకౌంట్ డెలీట్ చెయ్యటం తో )ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని ఊరట చెందాను.ఒక ఆరు నెలలకు మళ్లీ కొత్త పేరుతో ప్రాణం పోసుకుంది . అలా డెలీట్ చెయ్యటం వల్ల మంచి ,చెడు రెండూ కలిగాయి . కీడెంచి మేలెంచమన్నారు కదా ,అందుకని ముందు 

చెడు - పోస్ట్లయితే ఎక్కువ శాతం సేవ్ చేసుకోగలిగాను కాని ,కామెంట్లు చాలా వరకూ పోయాయి. పోస్ట్స్ లో ఉన్న పిక్చర్స్ పోయాయి. నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన మొదటి పోస్ట్ ఝాన్సీ ,వోర్చా ,గ్వాలియర్ కోట ల పిక్చర్స్. 
అవన్నీ పోయాయి. సో పోస్ట్ కూడా గాయబ్ :)  

ఇక మంచి ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనే నీతిని నేర్చుకోవటం !


ఈ నాలుగేళ్ళు గా నా బ్లాగ్ చదువుతున్నవారికి ,కామెంట్లు పెడుతున్నవారికి ,కామెంట్లు పెట్టని వారికి ,బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి అందరికీ ధన్యవాదాలు.





Hoping I can celebrate many more such birthdays for this blog ...