Thursday, 6 February 2014

కనులను తోచి చేతికందని ఎండమావులున్నాయికనులను తోచి చేతికందని ఎండమావులున్నాయి
కనులకు తోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం ...
సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
4 comments:

ఎగిసే అలలు.... said...

Superb Anuradha gaaru,mee blog ippude chusaa, chaalaa baagundi:-):-)

Anuradha said...

@ ఎగిసే అలలు,
Thank you andi.

sridevi gajula said...

చాల బాగుంది.

Anuradha said...

Thank you Sridevi gaaru !