ఈ రోజు సాక్షి ఫన్డే లో ప్రచురితమైన నా అనువాద కథ ...
http://epaper.sakshi.com/apnews/Funday/29062014/20
1965 ప్రాంతం లో ,23 యేళ్ళ వయసు లో బాషా పండితుడినవ్వటానికి శిక్షణ తీసుకుంటున్నాను.
మేము ఉంటున్న ఆవరణ లో మాదొక్కటే అపార్ట్మెంట్.నేను అందులో ఆరవ అంతస్తు లో ఉంటున్నాను.
సెప్టెంబర్ మాసం లో ఒక రోజు-పొద్దున్నే నా రూం లో చదువుకుంటున్నాను
చాలా బద్దకం గా ఉంది.చదువు మీద అంత శ్రద్ద పెట్టక అప్పుడప్పుడు కిటికి దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను
కిటికి నుంచి కార్నర్ లో ఉన్న పంచకోణాకారాపు స్థలం లోని డాన్ సెసారియొ(Don Cesareo) ఇల్లు కనిపిస్తుంది.
ఆ పక్కనే ఉన్న అందమైన ఇంటిలో బెర్నా స్కోని కుటుంబం నివశిస్తుంది.చాలా మంచివారు,దయాగుణం కలిగిన వారు.వాళ్ళకు ముగ్గురు అమ్మాయిలు.
పెద్ద అమ్మాయి అడ్రియాన అంటే నాకు ఇష్టం.తనను చూడటానికే కిటికి దగ్గర ఆ సమయం లో తచ్చట్లాడుతూ ఉంటాను
రోజూ లానే డాన్ సెసారియొ తన పెరట్లో మొక్కలకు నీరు పోస్తున్నాడు
రోడ్డు నిర్మానుష్యం గా ఉంది.ఇంతలో చూడటానికి బిచ్చగానిలా ఉన్న ఒక బక్క పలచని , గడ్డపు వ్యక్తి పక్కనే ఉన్న గృహ సముదాయం నుంచి డాన్ సెసారియొ,బెర్నా స్కోని ల ఇంటి ముందు పరిగెడుతూ కనిపించాడు.
తల మీద పసుపు రంగు గడ్డి టొపీ,చేతిలో మురికోడుతున్న సంచి.వెచ్చటి వాతావరణం లో కూడా కోట్ ధరించిఉన్నాడు.
ఆ బిచ్చ గాడు డాన్ సెసారియొ ఇంటి ముందు ఆగి ఏదో అడుగుతున్నాడు.డాన్ సెసారియొ ఆ బిచ్చగాడు చెబుతున్నది వినిపించుకోకుండా ,వెళ్ళిపొమ్మని సైగ చేసాడు.కానీ బిచ్చగాడు కదలకుండా అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండటం తో విసిగించకుండా వెళ్ళు ! అని పెద్దగా అరిచాడు.

అయినా బిచ్చగాడు వదలకుండా గేట్ తెరవటానికి ప్రయత్నించాడు.దానితో సహనం కోల్పోయిన డాన్ సెసారియొ బిచ్చగాడిని ఒక్క తోపు తోసాడు. దాని తో ఆ బిచ్చగాడు నిలదొక్కుకోలేక ,నేల మీద పడ్డాడు.కాళ్ళు ఆకాశం వైపు తిరిగాయి. తల మెట్టుకి కొట్టుకున్న చప్పుడు వినిపించింది
డాన్ సెసారియొ పరుగెత్తుకుంటూ వెళ్లి బిచ్చగాడి గుండెల మీద తలపెట్టి విన్నాడు.భయం తో బిచ్చగాడి కాళ్ళను పట్టుకుని పక్కకు లాగి,ఎవరూ చూసి ఉండరన్న ధీమాతో ఇంట్లో కి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
జరిగిన సంఘటన కు ఒకే ఒక సాక్షిని నేను .

కొద్ది సేపటికి రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తి చచ్చి పడున్న బిచ్చగాడిని చూసాడు.నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జనం పోగయ్యారు.పోలీసులు వచ్చారు. అంబులెన్స్ లో బిచ్చగాడి శవాన్ని తీసుకెళ్ళారు .
అంతటితో అది ముగిసింది. ఆ విషయం గురించి మళ్లీ ఎవరు మాట్లాడలేదు.నేను కూడా చాలా జాగ్రత్తగా అసలు ఆ విషయమై నోరు తెరవలేదు . నాకెప్పుడూ ఏ హాని చేయని ముసలివాని గురించి చెప్పినందువల్ల నాకేమి లాభం అనుకున్నాను.అంతే కాకుండా ఆ సంఘటన అనుకోకుండా జరిగింది. అతను కావాలని చంపలేదు.ఈ వయసులో కోర్టు,కచేరిల చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టటం ఎందుకు అనిపించింది.విషయాన్ని అతని మనసాక్షి కి వదిలేస్తే మంచిది అనిపించింది. నెమ్మదిగా కొద్ది కొద్దిగా ,ఆ సంఘటన ని మర్చిపోయాను.కాని ఎప్పుడు డాన్ సెసారియొ ని చూసినా ,ఒక వింత అనుభూతి.అతని రహస్యం తెల్సిన ఒకే ఒక వ్యక్తి ని నేను అన్న సంగతి అతనికి తెలియదు కదా అని !అప్పట్నుంచి ఎందుకో తెలియదు,అతన్ని తప్పించుకు తిరగటం మొదలుపెట్టాను.మాట్లాడే సాహసం చెయ్యలేదు.
1969 నాటికి స్పానిష్ బాష ,సాహిత్యం లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను.అడ్రియాన పెళ్లి వేరొకరితో అయ్యింది.అతను అడ్రియాన ని నా అంతగా ప్రేమిస్తాడా ?అడ్రియాన కి నాతో సరితూగగల వ్యక్తి లభించాడా అన్నది తెలియదు.
పెళ్ళయిన తర్వాత కూడా అడ్రియాన అదే ఇంట్లో నివసిస్తుంది.ఇప్పుడు గర్భవతి,డెలివరీ సమయం దగ్గర పడింది.
డిసెంబర్ నెల - ఉదయం హైస్కూల్ పిల్లలకు వ్యాకరణ పాటాలు చెప్తున్నాను.అలవాటు ప్రకారం మధ్య మధ్యలో కిటికీ నుంచి రోడ్ పైకి ఓ చూపు విసురుతున్నాను.
హటాత్తు గా గుండె ఆగినట్లు అనిపించిది. నేను చూస్తున్నది నిజమా ?భ్రమా ?
నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ఎదురుగా మళ్లీ !అవే చిరిగి పీలికలయిన బట్టలు,గచ్చకాయ రంగు కోటు,గడ్డి టోపీ ,చేతిలో మురికోడుతున్న సంచి తో బిచ్చగాడు !
నేను ,నా శిష్యులను మర్చిపోయి కిటికీ లో తల పెట్టేసాను.బిచ్చగాడు గమ్యం తెల్సినవాడిలా నెమ్మదిగా వస్తున్నాడు.
డాన్ సెసారియొ మీద పగ తీర్చుకోవటానికి బతికి వస్తున్నాడు అనుకున్నాను.
అయితే బిచ్చగాడు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు.పక్కనే ఉన్న బెర్నాస్కోని ఇంటి ముందు ఆగి గడియ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు.
"ఇప్పుడే వస్తాను" అని పిల్లలకు చెప్పి పరుగున అడ్రియాన ఇంటికి వెళ్లాను. అడ్రియాన వాళ్ళ అమ్మ గుమ్మం లోనే హలో ,అతిధి ! నువ్వు ఇక్కడ ? వింతలు ఎప్పటికి ఆగవా ? అంటూ ఎదురయ్యినది .
హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఏమి జరుగుతుందో ,నాకేమి అర్ధం కాలేదు.అడ్రియానా తల్లి అయ్యిందని ,అందరూ ఆ సంతోషం లో ఉన్నారని తెలిసి అభినందనలు తెలియచేసి వచ్చేసాను .
నాకు వాళ్ళను ఎలా అడగాలో అర్ధం కాలేదు.మౌనం గా ఉండటం బెటరా ? లేదా అడగాల ?అనుకుంటూ " ఒక బిచ్చగాడు సంచితో మీ ఇంటిలోకి రావటం చూసాను . దొంగతనానికి వచ్చాడేమో అని భయపడ్డాను. అందుకే బెల్ మ్రోగించకుండా లోనికి వచ్చాను. " అని చెప్పాను.
అందరూ నా వైపు ఒక ఆశ్చర్యపు చూపు పారేసి ,బిచ్చాగాడా ?దొంగతనానికా ?అన్నారు.అందరూ ఎక్కువ సమయం హాల్ లోనే గడుపుతారు కాన నేనేమి మాట్లాడుతున్నది వాళ్లకు అర్ధం కాలేదు.
నేను పొరపడి ఉంటాను అన్నాను .
బేబీ ని చూద్దువు రమ్మని అడ్రియాన ఉన్న గది లోకి తీసుకెళ్ళారు.అలాంటి సందర్భాలలో ఏమి మాట్లాడాలో నాకు తెలియదు . అభినందనలు తెలిపి ,ముద్దు పెట్టుకుని బేబీ ని చూస్తూ "పేరేమి పెడుతున్నారు " అని అడిగాను. "గుస్తావో" అని చెప్పారు.నేను ఫెర్నాండో పేరు ని ఇష్టపడేవాడిని అనుకున్నాను ,కాని బయటకు అనలేదు .
ఇంటికి తిరిగి వచ్చాక "ఆ బిచ్చగాడు పగ తీర్చుకోవటానికి రాలేదు ,అడ్రియాన కు బిడ్డగా జన్మ తీసుకోవటానికి వచ్చాడు "అనుకున్నాను. రెండు మూడు రోజుల తర్వాత నా ఊహ హాస్యాస్పదం గా అనిపించింది.
ఇక ఆ విషయం పూర్తిగా మర్చిపోయే వాడినేమో కాని ,1979 లో జరిగిన ఒక సంఘటన వల్ల మరచిపోలేకపోయాను .
కిటికీ ప్రక్కనే కూర్చొని పుస్తకం చదువుతూ ,మధ్యలో అటూ ఇటూ చూస్తూ ఉన్నాను.గుస్తావో ,వాళ్ళ ఇంటి టెర్రస్ పైన ఆడుకుంటూ కనిపించాడు.
వరసగా ఖాళి క్యాన్ లు ఉంచి ,నాలుగు గజాల దూరం లో నుంచుని రాళ్ళు విసిరి వాటిని పడగొడుతున్నాడు. విరిగిన రాళ్ళ ముక్కలు అన్ని డాన్ సెసారియొ పెరట్లో పడుతున్నాయి.పాడయిన పూలను డాన్ సెసారియొ చూస్తే పెద్ద ప్రళయమే వస్తుంది అనిపించింది .
అదే సమయం లో డాన్ సెసారియొ ఇంట్లో నుంచి పెరట్లో కి వచ్చాడు.వృద్దాప్యం మీద పడటం వల్ల తత్తరపడుతూ నడుస్తున్నాడు.గేట్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా మెట్లు దిగటానికి ఆయత్తమయ్యాడు.సరిగ్గా అప్పుడే గుస్తావో రాయితో క్యాన్ ని కొట్టాడు. అది గోడ మీద పల్టీలు కొట్టుకుంటూ పెద్ద శబ్దం తో డాన్ సెసారియొ పెరట్లో పడింది.ఆ శబ్దానికి ఉలిక్కిపడి మెట్లు దిగబోతున్న డాన్ సెసారియొ అదుపు తప్పి జారిపడ్డాడు.తల మెట్టుకు కొట్టుకుంది. ఇదంతా నేను చూసాను.పిల్లవాడిని డాన్ సెసారియొ కాని ,డాన్ సెసారియొ ని పిల్లవాడు కాని చూడలేదు.కొద్ది క్షణాల్లోనే జనం డాన్ సెసారియొ శవం చుట్టూ పోగయ్యారు.
మరుసటి రోజు ,వేకువనే లేచి కిటికీ దగ్గర స్థిరపడ్డాను.డాన్ సెసారియొ కి కర్మ కాండలు జరుగుతున్నాయి. రోడ్ పక్కన జనం ధూమపానం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి అడ్రియాన ఇంట్లోంచి ,మళ్లీ ఒకసారి చిరిగిన బట్టలు,పైన కోటు ,గడ్డి టోపీ, చేతిలో సంచి తో బిచ్చగాడు దర్శన మిచ్చాడు . నెమ్మదిగా గుంపు లో నుంచి దాటుకుని దూరం గా వెళ్లి ,అంతకు ముందు రెండు సార్లు ఎటువైపు నుంచి అయితే వచ్చాడో అటే అదృశ్యం అయ్యాడు.
ఆ రోజు మధ్యానం గుస్తావో కనిపించటం లేదు అన్న వార్త విని ఆశ్చర్యపోలేదు.ఇప్పటికీ బెర్నాస్కోని కుటుంబం,గుస్తావో కోసం వెతుకుతూనే ఉంది . ఆ వెతుకులాట అనవసరం అని వాళ్లకు చెప్పే ధైర్యం నాకు లేదు .
2 comments:
ఈమధ్య బ్లాగ్స్ చదవడం తగ్గడం మూలాన మిస్ అయ్యాను.. పత్రిక లో ప్రచురణ అయినందుకు ముందుగా శుభాకాంక్షలు అనూరాధ గారూ / అనురాధ గారు : ))
Thank you Harsha :))
Post a Comment