820 ఏళ్ళ క్రితం కాకతీయ రాజు రుద్రదేవుడి పేరు మీద ,ఆ రాజు వద్ద పని చేసే 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి పూర్తి గా శిధిలావస్థ కు చేరుకోవటం తో కొండపాక గ్రామస్థులు గుడిని పునర్నిర్మించారు. పురాతన గుడికి సంబంధించిన రాతి ధ్వజస్థంభం ,నటరాజు బండ (దేవదాసీలు,ఆ బండమీద నృత్యం చేసేవారట) కొత్తగా నిర్మించిన గుడిలో ఉంచారు.అలనాటి శాసనాలు ఓ రెండు ఉన్నాయి .
మేము ముందుగా వేములవాడ వెళ్లి రాజరాజేశ్వరుని దర్శించుకుని కొండపాక వచ్చేప్పటికి గుడి మూసి ఉంది.అది చూసి నీరసం వచ్చింది.అక్కడే ఉన్న ఒక గ్రామస్తుడు,పూజారి గారి ఫోన్ నంబర్ ఇస్తాను ,ఫోన్ చెయ్యండి వస్తారు అని చెప్పటం తో కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యాము.నంబర్ తీసుకుని ఫోన్ చేసాము.పది నిమిషాలలో పూజారి గారు వచ్చారు.గర్భగుడిలోకి వెళ్లి,పూజారిగారు మంత్రాలు చదువుతుంటే స్వయంగా స్వామివారికి అబిషేకం చేసుకున్నాం. అందుకనే నాకు పేరున్న గుళ్ళకు వెళ్ళటం కంటే అంతగా ప్రాముఖ్యత లేని గుడికి వెళ్ళటమే ఇష్టం :)
ఆ తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం కి వెళ్ళాము. చిన్న కొండ పైన గుహ లో ఆలయం ఉంది.మల్లిఖార్జున స్వామి సుమారు 500 ఏళ్ళ క్రితం స్వయం భూ గా గుహలో వెలిసారంట. ఇక్కడ స్వామి వారు విగ్రహ రూపం లో కేతమ్మ ,మేడాలమ్మ సహితం దర్శనమిస్తారు.
చివరి రెండు పిక్స్ గూగుల్ సౌజన్యం తో .
No comments:
Post a Comment