Tuesday 18 November 2014

మహానంది

 ప్రతి సంవత్సరం లానే కార్తీక మాసం లో ,సాయిబాబా గుడి వాళ్ళు శివ,వైష్ణవ గుడి సందర్శనకు ప్రోగ్రాం వేసారు.ఈ సంవత్సరం మహానంది,యాగంటి ,అహోబిలం ,మంత్రాలయం తీసుకు వెళ్ళారు. నంద్యాల కు 21 కి.మీ దూరం లో ఉన్న ఈగుడి  మొట్టమొదటగా 1500ఏళ్ళ క్రితం నిర్మించబడింది. కాలక్రమంలో అనేకసార్లు పునర్నిర్మించారు. ప్రపంచం లోనే అతిపెద్దదైన నంది విగ్రహం ఇక్కడ నంది పార్క్ లో ఉంది.ఇక్కడ ఉన్న కోనేటి లోకి నీరు ఎలా వస్తుంది అన్నది మిస్టరి.గర్భగుడి లో ఉన్న శివలింగం వద్ద నుంచి కోనేటి లోకి నీరు వస్తుంది అని అనుకోలు.కోనేటి లో నీరు చాలా స్వచ్చం గా ఉంది. ఈ గుడి ప్రాంగణం లోనే ఉన్న కామేశ్వరి అమ్మవారి  గుడి మంటపం పై కప్పు,స్తంభాల మీద చెక్కిన శిల్పాలను చూస్తే నిజం గానే  అందరూ చెప్తున్నట్టు దేవశిల్పి ఈ గుడి నిర్మాణం చేసి ఉండొచ్చు అని  నమ్మవచ్చు.మాటల్లో చెప్పలేనంత అందం గా ఉంది.నవనందుల్లో ఒకటైన వినాయక నంది ని కూడా దర్శించుకుని అహోబిలం వెళ్ళాము .

 
             ప్రవేశ ద్వారం 



 
కోనేరు లో ... 
 
 
 
 

4 comments:

నాగరాజ్ said...

బాగున్నాయండీ మహానంది వివరాలు. హేవిటో... కర్నూలు కబుర్లు వినగానే ప్రాణం లేచి వస్తుంది :)

Anuradha said...

స్వంత ఊరి పైన మమకారం :))

ఫోటాన్ said...

బాగుందండీ!
చాలా సార్లు సందర్శించిన గుడి ఇది, లోపల వున్న కోనేరంటే నాకు బాగా ఇష్టం :)
నంది తో పాటు మరికొన్ని ఫొటోస్ పెట్టుంటే ఇంకా ఆనందంగా వుండేది :)

Anuradha said...

అమ్మవారి గుడిలో ఫోటో లు తీయాలని అనిపించినా,గుడి లోపల ఫోటో లు తీయటానికి అనుమతి లేదు హర్ష.అందువల్ల గుడి వెలపల ఫోటో లు మాత్రమే తీయగలిగాను :)