మహానంది లో దైవదర్శనం పూర్తి చేసుకుని అక్కడే గుడి వెలుపల భోజనాలు చేసాము.ఆ తర్వాత అహోబిలానికి బయలుదేరాము.అక్కడికి చేరేటప్పటికి సమయం 7:30గం. బస్ లో కొంతమంది ఎగువ అహోబిలం లోని స్వామి ని దర్శించుకోకుండా ఈ గుడికి వెళ్ళకూడదు అని అనటం తో ఎగువ అహోబిలం వెళ్ళాము.మేము వెళ్ళేప్పటికి గుడి మూసివెయ్యడం తో తిరిగి దిగువ అహోబిలం వచ్చి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నాము.ఈ గుడికి వెళ్ళే దారి లో రెండు వైపులా మంటపాలు లాంటివి ఉన్నాయి.అందులో కొన్ని శిధిలమయి ఉన్నాయి .పూర్వం వాటిని దేని కొరకు ఉపయోగించారో తెలియదు కానీ ,ప్రస్తుతం అంగళ్లు ఉన్నాయి.గుడి లోపల ప్రాంగణం లో కూడా కొన్ని మంటపాలు శిధిలావస్థ లో ఉన్నాయి.
తిరుపతి వేంకటేశ్వరస్వామి వివాహం చేసుకునే ముందు నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవటానికి ఎగువ అహోబిలం వచ్చారంట.అక్కడ స్వామి ఉగ్రరూపంలో ఉండటంచూసి,దిగువ అహోబిలం వచ్చి
లక్ష్మీనరసింహస్వామి ని ప్రతిష్టించారట.
ఇలాంటి టూర్ కి గ్రూప్ గా వెళితే అడ్వాంటేజ్ ఎంత ఉందో ,డిజ్అడ్వాంటేజ్ కూడా అంతే ఉంది.హడావిడి గా చూసి వచ్చెయ్యాలి.ఇంకోసారి మా ఫామిలీ వరకే వెళ్ళాలి అనుకున్నాము. ఎప్పటికి కుదిరేనో !
గుడి మంటపం లోని స్థంబాల పైన చెక్కిన విగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తున్నారు .

2 comments:
రెండు పార్ట్లు చదివానండీ, ఫొటోస్ బాగున్నాయి రైటప్ తో పాటు :)
Thank you Harsha :)
Post a Comment