Thursday, 22 January 2015

బాగుంది

 
 
 
 
ఒక 5,6 నెలల క్రితం వరకు ఈ చెరువు గుర్రపుడెక్కతో నిండి ,నీరన్నది కనిపించకుండా పచ్చగా ఉండేది.చెరువుల పరిరక్షణ పధకం పుణ్యమా అని బాగుపడింది. 
 
ఇంకో సంతోషపడే విషయం ఏమిటంటే ,బస్సుల్లో పార్టిషన్ .అంతకు ముందు సాయంత్రం ఆరు తర్వాత బస్సు లో ప్రయాణం అంటే భయం వేసేది.కొంచం సెన్స్ ఉన్న బస్ డ్రైవర్ అయితే ,తాగి ఉన్నవాళ్ళను ఫ్రంట్ డోర్ నుంచి ఎక్కనిచ్చేవాడు కాదు. దాని వల్ల గొడవ.ప్రయాణికులు కలగజేసుకుని ,ఆ తాగి ఉన్నవాడిని  బస్ బాక్ డోర్ నుంచి ఎక్కించి ,ఇక బస్ స్టార్ట్ చెయ్యవయ్య అనే వరకు   డ్రైవర్ బస్ ఆపేసేవాడు.  డ్రైవర్ పట్టించుకోకుండా ఉంటే ,ఆ బస్ ఎక్కినవాడు తూలుతూ ఉంటే ,ఎక్కడ మీద పడతాడో అని భయం.ఆ కంపు కి వామిటింగ్ సెన్సేషన్ ... బస్ ప్రయాణం నరకాన్ని తలపించేది. ఇప్పుడు బస్సుల్లో పార్టిషన్ వల్ల హాయి గా ఉంది . 
 
 
 
        


No comments: