వేషము మార్చెనూ
భాషను మార్చెనూ
మోసము నేర్చెను
అసలు తానే మారెనూ
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలెదు
ఆయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
ఆతని మమత తీరలెదు
ఆయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
ఘొరారణ్యములు ఆక్రమించెను
హిమలయము పై ఝండా పాతెను
ఆకాసం లో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఘొరారణ్యములు ఆక్రమించెను
హిమలయము పై ఝండా పాతెను
ఆకాసం లో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
అతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమే మేలని బోధలు చేసెను
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమే మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు
అతని బాధ తీరలేదు
ఇది 1962 లో వచ్చిన గుండమ్మ కథ చిత్రం లోని పాట . రాసినది పింగళి నాగేంద్ర .
అయినా మనిషి మారలేదు ... అతని కాంక్ష తీరలేదు
నిజమే కాలంతో పాటు ,ఎన్నో మార్పులు వచ్చినా మనిషి మారలేదు
ఒకప్పుడు ఆధిపత్యం కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే ,ఇప్పుడు దేశాల మధ్య ... రాష్ట్రాల మధ్య ...
ఒకప్పుడు రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేవారు . ఇప్పుడు ప్రజల సొమ్ము విగ్రహాల పాలు
ఎంతమంది స్వామీజీ లు ,గురువులు ఉంటే వారి భక్తుల సొమ్ము - అన్ని స్తూపాలు ,విగ్రహాల పాలు
ఇక బాధలు గురించి తెలియనిదేముంది ?అవి కలకాలం కళ కళ లాడుతూ ఉంటాయి :))
No comments:
Post a Comment