వాఘా బోర్డర్ వేడుక -
భారత్ ,పాకిస్తాన్ దేశాల సరిహద్దు వద్ద జరిగే ఇలాంటి వేడుక ప్రపంచం లో మరెక్కడ లేదు.ఈ వేడుక ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయానికి రెండు గంటల ముందు మొదలు అయ్యి ,సూర్యాస్తమయ సమయానికి ఇరు దేశాల జండాలు ఒకే సమయంలో క్రిందకు దించటంతో పూర్తి అవుతుంది.రెండు గంటలకు attari కి చేరుకున్న మేము ,సెక్యూరిటీ చెక్ లు అన్నీ పూర్తీ చేసుకుని ,గ్యాలరీ చేరుకునే సరికి 4 అయ్యింది.చూడటానికి వెళ్ళిన వారు ,ఆసక్తి ఉంటే మన దేశపు జండా పట్టుకుని పరుగులు పెట్టవచ్చు. ప్లే చేస్తున్న పాటలకు డాన్సు చెయ్యొచ్చు :)మా అమ్మాయి ,మేనకోడలు - ఇద్దరు జెండా పట్టుకుని పరుగు పెట్టి వచ్చారు. వేడుక జరుగుతున్నంత సేపు ఒక రకమైన భావోద్వేగం . చూడటానికి బాగుంది . కానీ ,ప్రతి రోజూ ,కొన్ని గంటల సమయం వృధా చెయ్యటం - అవసరమా అనిపించింది .
2 comments:
Nice blog post. Its sentimental pics for ppl of India n Pakistan.Coz once they were part of integrated nation Hindustan !!!
Thank you for commenting Arbinda.yes, agree with U :)
Post a Comment