మాజీ ప్రధాని I.K.Gujral అమ్మగారి పేరు తో నిర్మించిన ఈ సైన్స్ సిటీ చూడటానికి ఎంతో బాగుంది. ఒక రోజు అంతా సరిపోతుంది ,పూర్తిగా చూడటానికి. జలంధర్ వెళ్తే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.పిల్లలనే కాదు ,పెద్దలనూ అలరిస్తుంది.లేజర్ షో చాలా బాగుంది .
మన పూర్వీకులు -కోతులు అని చదువుకున్నాము కదా !కోతి నుంచి ఇప్పటి రూపానికి మధ్య లోని దశలు ,బొమ్మల రూపం లో చూడొచ్చు .
వర్చ్యువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. వివిధ గ్రహాల పైన మీరు ఎంత బరువు ఉంటారో తెలుసుకోవచ్చు.ఆస్ట్రోనాట్ రూపం ధరించొచ్చు :)కొద్ది క్షణాలు న్యూస్ రీడర్ అవతారం దాల్చొచ్చు .
Apollo 16, 17 చంద్రుని పై సేకరించిన రాళ్లు చూడొచ్చు .
మాజిక్ చెయ్యటం తెలియదా ? పర్వాలేదు ,ఇక్కడ ఫోటో దిగి మాజిక్ చేసాను అని చెప్పొచ్చు :)
నేను చెప్పింది 1 % మాత్రమే . మిగతావి చూసి తెల్సుకోవాల్సిందే :)
ఇవాళే న్యూస్ లో చూసాను - మండలానికో వైన్ షాప్ మంజూరు ... ఎవరిని ఉద్దరించటానికో ?
విజ్ఞానం ,వినోదం పంచే ఇలాంటి సైన్స్ సిటీ లు ,ప్రతి ఒక్క రాష్ట్రం లో ఉంటే బాగుంటుంది .
No comments:
Post a Comment