మూడో రోజు ,ధర్మస్థల కి ప్రయాణం. మంజునాథ స్వామి ఆలయం.
800 ఏళ్ల క్రితం,కుడుమ(ఇప్పటి ధర్మస్థల)అనే గ్రామంలో బిర్మన్నపెరగాడే అనే దంపతులు నివసించేవారు.దేవతలు,ధర్మ పరిరక్షణకు అనువైన స్థలం వెదుకుతూ, కుడుమ గ్రామానికి వచ్చారంట. బిర్మన్న దంపతుల ఆతిధ్యానికి మెచ్చి , కలలో కనిపించి - వారు ఉంటున్న ఇంటిని దేవతలను కొలవటానికి ఉపయోగించమని చెప్పారంట.దాని ప్రకారమే వారు ఆ ఇంటిని ఖాళీ చేసి దేవతలను(కాలరాహు,కుమారస్వామి,కన్యాకుమారి)ప్రతిష్టించి పూజలు జరపటం ప్రారంభించారట.పూజా కార్యక్రమాలు నిర్వహించే వారి కోరిక మేరకు శివలింగాన్ని ప్రతిష్టించారట.
చాంతాడంత క్యూ.200రూపాయల టికెట్ తీసుకున్నాము.వృద్ధులు,అంగవైకల్యంఉన్నవారు క్యూలో కాకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు.మాకు దర్శనం చేసుకోవటానికి మూడున్నర గంటలు పట్టింది.
గుడి వెలుపల (వెళ్లే దారి లో )వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన రథాలు,పాతవి ఉన్నాయి . ఎంతో అందం గా ఉన్నాయి.
గంగాధర స్వామి రథ,శ్రీరంగపట్నం |
అమృతేశ్వర రథ,హాసన్
మల్లేశ్వర స్వామి రథ,బళ్ళారి
దర్శనం చేసుకుని,అక్కడే లంచ్ చేసి కటీలు కి వెళ్ళాము . వివరాలు తర్వాతి పోస్ట్ లో .
2 comments:
beautiful collections. nicely taken snaps. amazing creation. great hands creating eyecatching temples !!!
Thank you for the appreciation :)
Post a Comment