యాత్ర లో చివరి రోజు బేలూరు ... అక్కడ్నుంచి డైరెక్ట్ బెంగళూరు రైల్వే స్టేషన్ ... మరుసటి రోజు ప్రొద్దున్నే ఇంటికి చేరాము.సమయాభావం వల్ల లిస్ట్ లో ఉన్న హాలేబీడు,శ్రావణ బెళగొళ చూడలేకపోయాము.వాటికి కాంపెన్సేషన్ అన్నట్టు లిస్ట్ లో లేని ఆనిగెడ్డ వినాయకుడుని,కలశ లోని కలసేశ్వరుడుని దర్శించుకున్నాము.
ఏడు ముక్తిస్థలాల్లో,ఆనిగెడ్డ ఒకటి.ఆనిగెడ్డ కు ఇంకో పేరు కుంభాశి.అగస్త్య ముని యజ్ఞం చేస్తుండగా కుంభాసురుడు అనే రాక్షసుడు ఆటంకం కలిగిస్తుంటే వినాయకుడు,భీముని కి కుంభాసురుడు ని చంపటానికి ఒక ఖడ్గం ఇచ్చ్చారుట.ఆ ఖడ్గంతో భీముడు కుంభాసురుడు ని చంపి యజ్ఞానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చేసాడు. అందువల్ల కుంభాశి అనే పేరు ... ఇక్కడ స్వామికి ,భక్తులు వక్కపూలు సమర్పిస్తున్నారు. ప్రసాదంగా వక్క పూలు ఇస్తే ,తినొచ్చా - తినకూడదా ఏమి చెయ్యాలి అనుకుంటూ కొంతసేపు చర్చించుకుని ఆఖరికి తిన్నాము. టేస్ట్ బాగానే ఉంది- కొంచం పుల్లగా.మేము తినటం పూర్తయ్యాక చూసాము.స్థానికులు అనుకుంట,వక్కపూలుతలలోపెట్టుకున్నారు.మనం తెలియక తినేసాము,తినటానికి ఫస్ట్ అనుకుంటూ నవ్వుకున్నాము.

(ఫోటో గూగుల్ నుంచి )
వక్కపూలు (శృంగేరీ లో తీసిన ఫోటో )
స్కంధ పురాణం,తుంగభద్ర కాండం లో ,కలశ గురించి ప్రస్తావన ఉందట.దీనిని దక్షిణ కాశీ గా భావిస్తారు.