Tuesday, 17 January 2017

కర్ణాటక కోవెల యాత్ర - శృంగేరి

అష్టాదశ శక్తి పీఠాలలో కాశ్మీర్ లోని సరస్వతీ పీఠం ఒకటి.మా టూర్ ఆపరేటర్ చెప్పటం,ఇప్పుడు కాశ్మీర్లో శక్తి పీఠం లేదు అని.అక్కడ అమ్మవారికి పూజలు సరిగా చెయ్యటం లేదని,శంకరాచార్యుల వారు,అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్టించారని. నిజం ఎంతో తెలియదు.తుంగా నది ఒడ్డున ఈ గుడి ఉంది.అమ్మవారి గుడి తో పాటు విద్యాశంకర గుడి కూడా ఉంది.







శృంగేరి లో అమ్మవారిని దర్శించుకుని,ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి అక్కడే ఉన్నారని తెలిసి , ఆయనను  కూడా చూసి ఆశీర్వాదం తీసుకుని వచ్చాము.భోజనం పీఠం లోనే కానిచ్చి హోరనాడు వెళ్ళాము.ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి గుడి ఉంది.చుట్టూ కొండలు,ఎటు చూసినా పచ్చదనం ... చాలా బాగుంది. 



     



No comments: