ఆరోగ్యకరమైన అల్పాహారం
కావాల్సిన పదార్ధాలు :
- బియ్యం – 1 కప్పు
- స్వీట్ కార్న్ – 1 కప్పు
- రాజ్మా – 1/2 కప్పు
- శనగపప్పు – 1/2 కప్పు
- పెసరపప్పు – 1/4 కప్పు
- కరివేపాకు – 2 రెబ్బలు
- ఇంగువ – 1/4 టీ స్పూను
- ఎండుమిరపకాయలు – 5
- ఉప్పు తగినంత
తయారు చేసే విధానం :
బియ్యం,శనగపప్పు,రాజ్మా,పెసరపప్పు ను నాలుగు గంటలు నానపెట్టుకోవాలి
నీరు వంపేసి, కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి
రుబ్బిన పిండిలో ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి
రుబ్బిన పిండిని రెండు మూడు గంటల తర్వాత వాడుకోవచ్చు
బెల్లం తో గానీ కొబ్బరి చట్నీ తో గానీ
వేడి వేడిగా తింటే బాగుంటుంది.
2 comments:
బెల్లంతోనా ? దోసె ని కారంతో తింటే బాగుంటుంది కదా ?
ఈ దోశ బెల్లం తోనే బాగుంటుంది నీహారిక గారు :)
Post a Comment