అల్లం ... తెలియని/చూడని వాళ్ళు ఉండరేమో ! ఆ మొక్కను ఎంతమంది చూసి ఉంటారో తెలియదు.అల్లపు మొక్కకి ,అల్లం జాతికి చెందిన ఇతర మొక్కలకి పూలు పూస్తాయన్న సంగతి తెలుసా ?వెయ్యి కి పైనే అల్లం జాతి మొక్కలు ఉన్నాయి.వాటిలో ఓ మూడు రకాలు నేను చూసాను.ఆ మొక్కల పూల ఫోటోలు మీ కోసం
మొదటగా చూసింది - Costus pictus (Painted spiral ginger) అప్పటికి అది అల్లం జాతి మొక్క అని తెలియదు.మా పిన్నికి తెలిసిన వారు, ఈ మొక్క ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని చెప్పి ఇచ్చారంట.ఆకులు పుల్లగా ఉన్నాయి.టేస్ట్ బాగుంది, తినొచ్చు అని అనుకున్నాము.మొక్క పేరు తెలియదు.ఆ తర్వాత అదే మొక్కను మా ఎదురింటి వాళ్ళింట్లో చూసాను.పేరు ఏమిటి అని అడిగితే, తెలియదు ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని నా ఫ్రెండ్ ఇచ్చింది. వేరే ఎవరికైనా అయితే ఆవిడ ఒక మొక్కను 500 కి అమ్ముతుంది.ఆకులయితే ఒక్కో ఆకు 10రూపాయలకు అమ్ముతుంది. నాకు ఫ్రీ గా ఇచ్చారు అని చెప్పారు.ఆ తర్వాత కొద్ది రోజులకు పూలు పూశాయి ,వచ్చి చూడండి అని చెప్పారు.(వాళ్ళింట్లో ఏ మొక్కకు పూలు పూసినా అందర్నీ పిలిచి చూపించటం ఆవిడ అలవాటు) పూలు చాలా అందం గా ఉన్నాయని నేను ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత గూగుల్ ఇమేజ్ సర్చ్ లో కొన్ని రోజులు పాటు ప్రయత్నించి ఎట్టకేలకు పేరు కనుక్కున్నాను 😊
No comments:
Post a Comment