Sunday 29 September 2019

చాక్ అండ్ డస్టర్


చాలాకాలం గా మన సినిమాలలో టీచర్లను బఫూన్ ల లాగా చూపిస్తున్నారు. అందుకు భిన్నం గా టీచర్లను గొప్పగా చూపిస్తూ తీసిన చిత్రమే ఈ చాక్ అండ్ డస్టర్ . నాటకీయత పాలు కొంచం ఎక్కువైనా,కొద్దిపాటి లోపాలున్నా   అంతగా పట్టించుకోనక్కరలేదు. సినిమా అద్భుతం అని చెప్పను కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సెలెబ్రిటీ ల పుట్టినరోజులు గుర్తుంచుకుని మరీ విష్ చేస్తాము. గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్తాము  కానీ మనకు చదువు నేర్పించిన గురువును గుర్తు పెట్టుకుని  వారికి విషెస్ చెప్పము అని. నిజమే కదా ! సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే జరుపుకుంటాము.ఆ రోజైనా గురువులకు ఎంతమందిమి విష్ చేస్తాము ? ఈ సినిమా చూడాలని అనుకునేవారు కోసం లింక్ ఇస్తున్నాను. 





   

1 comment:

విన్నకోట నరసింహా రావు said...

"Chalk N Duster" హిందీ చిత్రానికి ఇక్కడ లింక్ ఇచ్చినందుకు థాంక్స్.

ఆ చిత్రంలో చూపించినవి చాలా వరకు ఇప్పటి స్కూళ్ళల్లో జరుగుతున్న అకృత్యాలే. ముఖ్యంగా తరగతి గదిలో టీచర్ కుర్చీ తీసెయ్యడం లాంటి ఘోరాలు. మా పక్కింటమ్మాయి ఒక స్కూల్లో టీచర్ గా జేరిన నెల లోపే ఆ ఉద్యోగాన్ని వదీలేసింది. ఏమైందని అడిగితే ... కుర్చీ లేదు అంకుల్, పైగా క్లాసురూమ్ లో కెమేరా కూడా, వాళ్ళు సతాయింపు బేరం నాకు నచ్చలేదు అన్నది. సరే, ఆ టీచర్ సబ్జెక్టే కాక సంబంధం లేని సబ్జెక్ట్ కూడా అంటగట్టడం కూడా జరుగుతోంది .. ఆ అమ్మాయే చెప్పింది (తనని ఇంగ్లీష్ టీచర్ గా తీసుకున్నారు, కానీ ఇతర సబ్జెక్ట్ లు కూడా బోధించాలని త్వరలోనే వత్తిడి మొదలెట్టారట. ఫలానా టీచర్ ఏ సబ్జెక్ట్ లో ట్రెయినింగ్ అయిన వ్యక్తీ అన్న ఇంగితం లేదు. మూడు నాలుగు సబ్జెక్ట్ లు ఒకే టీచర్ మీద రుద్దేసి డబ్బు మిగుల్చుకుందామనే ఆబ. తనెంత గొప్పగా పని చేస్తున్నానో మేనేజ్మెంట్ కు చూపించుకోవాలనే దురద. అందుకోసం తన సిబ్బందిని హింసించడం, వయసులో పెద్దవారైన టీచర్లను కూడా ఏదో వంకతో అవమానించడం, టీచర్లు మీద ప్రిన్సిపాల్ కాక వేరే సూపర్వైజర్ ను రుద్దడం (మా రోజుల్లో ఇటువంటీ పద్ధతే పుట్టలేదు), టీచర్ల పిల్లలకు ఇచ్చే ఫీ రాయితీను రద్దు చేయడం ... ఇవన్నీ సతాయించడంలో భాగం.

విద్య వ్యాపారంగా మారడం వలన ఇటువంటి దరిద్రపు కార్పొరేట్ సంస్కృతి స్కూళ్ళల్లో కూడా ప్రవేశించింది. ఇది సమాజానికి పట్టిన దౌర్భాగ్యం. దురదృష్టకరం ఏమిటంటే ఇటువంటి కుసంస్కారపు, అహంకారపు పద్ధతులు ఒక స్కూలు మొదలెడితే ఆ సంగతి చాలా త్వరగా ప్రచారం ఐవుతుంది, ఇంతలో స్కూళ్ళు కూడా అమలు చేస్తాయి. నియంత్రణ కూడా కొరవడడంతో ఇష్టారాజ్యపు కాలంలో బతుకుతున్నాం.

గురువులను విద్యార్థులు గౌరవించడం కంటే ఈ చిత్రంలో ఎక్కువ ఫోకస్ చేసినది టీచర్లను స్కూలే గౌరవించడం లేదు అన్న అంశం మీద ... అని నాకు అనిపించింది.

ఏమైనా చూడదగిన సినిమానే.