మాహుర్ లో ఒకే కొండ పైన మూడు దేవాలయాలు ఉన్నాయి. రేణుక, అనసూయ మరియు దత్తాత్రేయ.మొదటగా రేణుకాదేవి గుడి.గుడికి చేరుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కాలి.మెట్లకిరువైపున,మొదట్లో దుకాణాలున్నాయి. అమ్మవారికి సమర్పించుకోవటానికి,చీరలు, గాజులు,పూలు, ప్రసాదాలు అమ్ముతున్నారు.ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలపాకులు , వక్క ,సోంపు అమ్మవారికి ఇస్తున్నారు.వాటిని దంచి విగ్రహం నోటి భాగం లో ఆ ముద్దను పెట్టారు. వచ్చిన భక్తులకు అదే ప్రసాదం గా ఇస్తున్నారు.
గుడి వెనక వైపు మెట్లు ఉన్నాయి.కిందకు దిగితే పరశురాముడి గుడి ఉంది. ఈ గుడికి వెళ్లే దారి పొడుగూతా కోతులు గుంపులు గుంపులుగా ఉన్నాయి.
వాటిని చూస్తే కొంచం భయం అనిపించి వెనక్కు వెళ్ళి పోదాము అనుకున్నాము.మళ్లీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాము.
ఈ గుడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళటానికి మెట్లు, మట్టిబాట ఉంది. అక్కడకు వెళ్లకుండానే వెనక్కివచ్చేసాము.పరుశురాముడు తల్లి తల నరికిన తర్వాత ఆ కోనేట్లోనే స్నానం చేసాడంట. ఆలా అని అక్కడకు వచ్చిన ఒకరు చెప్పారు.
మాకు తిరిగి సికిందరాబాద్ రావటానికి ట్రైన్ రాత్రి 9:30 కి . ఇంకా చాలా టైం ఉండటం తో మాహుర్ నుంచి సహస్రకుండ్ జలపాతం దగ్గరకు వెళ్ళాము. చెపితే తప్పించి అది జలపాతం అని తెలిసే ఛాన్సే లేదు. అలా ఉంది :) ఇక్కడ కూడా కోతులు విపరీతం గా ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. చల్లటి గాలి ... కొద్దిసేపు అలా చుట్టూ చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ, మాట్లాడుకుంటూ కాలం గడిపి, జలపాతానికి దగ్గరలోనే ఉన్న పాక హోటల్ లో టీ తాగి , తిరిగి నాందేడ్ కి బయలు దేరాము.

No comments:
Post a Comment