పరిక్షల సీజన్ వచ్చేసింది.పరిక్షలు రాసే వాళ్ళకే కాదండోయ్ ,పేపర్లు దిద్దే వాళ్ళకు కూడా కష్ట కాలమే.కొంత మంది రాసే, ప్రశ్నలకు సంబంధం లేని జవాబులు,చిరాకు తో పాటు నవ్వును కూడా తెప్పిస్తాయి.ఏడవ తరగతి అమ్మాయి ,అక్బర్ పరిపాలన గురించి రాయమని ప్రశ్న ఇస్తే ఏమి రాసిందో చదవండి.
అక్బర్ పరిపాలన: ఆకాశం నీలం గా ఉంటుంది.ఆకాశం లో రంగు,రంగుల గాలి పటాలు ఎగురుతున్నాయి.ఎరుపు,పచ్చ,నీలం,పసుపు,గులాబీ రంగుల గాలి పటాలు ఎగురుతున్నాయి.బాగా పైకి ఎగురుతున్నాయి. ఇలా అక్బర్ పరిపాలన కొనసాగింది.
ఇదే మేటర్ ను ఐదారు సార్లు రాసి ఒక పేజీ నింపేసింది.అక్బర్ పరిపాలనకి,ఆకాశం లో గాలి పటాలకు సంబంధం ఏమైనా ఉందా?
No comments:
Post a Comment