Thursday 22 April 2010

మీ హృదయం పదిలమా?






 డా: దేవి శెట్టి ,హార్ట్ స్పెషలిస్ట్ (నారాయణ హృదయాలయ,బెంగళూరు)మరియు విప్రో ఉద్యోగుల మద్య జరిగిన సంభాషణ .అందరికి ఉపయోగకరం గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను.




ప్ర: గుండె ఆరోగ్యం గా ఉండాలంటే ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలి?
జ:
  1. డైట్ :కార్బోహైడ్రేట్ లు ,నూనె ,తక్కువ,ప్రోటీన్లు ఎక్కువ,ఉన్న ఆహారం తీసుకోవాలి.
  2. వ్యాయామం: రోజూ అరగంట సేపు నడక (కనీసం వారానికి అయిదు రోజులు)
  3. స్మోకింగ్ మాని వేయాలి.
  4. వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి.
  5. బి.పి.,షుగర్ లు కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ప్ర: గుండె జబ్బులు వంశ పారంపర్యం గా వస్తాయా?

జ :అవును.

ప్ర: కొంతమందికి , ఎంతో ఆరోగ్యం గా ఉన్నప్పటికీ హార్ట్ ఎటాక్ రావటానికి కారణం?
జ:దానిని సయిలెంట్  ఎటాక్ అని అంటారు. అందుకనే మేము ,ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిని రెగ్యులర్ గా చెక్ అప్ చేయించు కోమని చెప్పుతున్నాము.

ప్ర: వాకింగ్ మంచిదా?జాగింగ్ మంచిదా?

జ :జాగింగ్ కంటే వాకింగ్ చేయటం  మంచిది.జాగింగ్ చేయటం వల్ల తొందర గా అలసి పోతారు.జాయింట్స్ ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది.   

ప్ర:లో బి.పి.ఉన్నవాళ్ళకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందా?
జ :చాలా అరుదు.

ప్ర:కొలస్ట్రాల్ ఏ వయసు నుంచి మన  శరీరం లోaccumulate అవుతుంది?
 జ:చిన్న వయసు నుంచి accumulate  అవుతుంది.


ప్ర:మందులు వాడకుండా కొలస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చా?
జ:డైట్ కంట్రోల్ ,వాకింగ్ చేయటం,ఆక్రూట్ లు తినటం  ద్వారా తగ్గించు కోవచ్చు.

ప్ర:స్ట్రెస్స్  తగ్గించు కోవటం ఎలా?
జ:జీవితం పట్ల మన ద్రుక్పధం మారాలి.ప్రతి ఒక్క దానిలో ఫర్ఫె క్షన్  కోసం చూడకూడదు.
ప్ర:యోగా వల్ల ఉపయోగం ఉందా?
జ:ఉంది.

ప్ర:చేప తినటం గుండెకు మంచిదా?
జ:కాదు.

ప్ర:వేరు శనగ నూనె,పొద్దుతిరుగుడు నూనె,olive ఆయిల్ ,వీటిలో ఏ నూనె వాడితే మంచిది?

జ:ఏ నూనె అయినా ఒకటే.ఏదీ మంచిది కాదు.

ప్ర:ఇటీవల చాలా చిన్న వయసు వాళ్ళకే (30 -40 )హార్ట్ ఎటాక్ వస్తుంది.కారణం ఏమిటి?

జ:జంక్ ఫుడ్ తినటం,వ్యాయామం లేకపోవటం,స్మోకింగ్ మెయిన్ కారణాలు.జెనెటిక్ కారణాల వల్ల భారతీయులు----యురోపియనులు,అమెరికన్లు కంటె మూడు రెట్లు  ఎక్కువగా హార్ట్  

అటాక్ కు గురి అవుతున్నారు.

ప్ర:మేనరికాల వల్ల,వారి  పిల్లలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా?
జ:ఉంటుంది.
ప్ర:గుండె జబ్బులు ఆడవారికంటే మగవాళ్ళకు ఎక్కువ రావటానికి కారణం?
జ:45 ఏళ్ళు వచ్చే వరకు ,ఆడవారి లో గుండె జబ్బులు రాకుండా సహజ రక్షణ వ్యవస్థ ఉంది.

ప్ర:మధుమేహానికి,గుండె జబ్బులుకు సంబంధం ఉందా?
జ:ఉంది .మధుమేహ రోగులకు, గుండె జబ్బులు రావటానికి ఎక్కువ అవకాశం ఉంది.

ప్ర:హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ప్రధమ చికిత్స ఎలా చేయాలి?
జ:హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి ని పడుకోబెట్టాలి.ఆస్ప్రిన్ టాబ్లెట్ ను నాలిక క్రింద ఉంచాలి.అందుబాటు లో ఉంటె sorbitrate టాబ్లెట్ ను నాలిక క్రింద ఉంచాలి.సాధ్యమైనంత తొందరగా పేషంట్ ను కరోనరీ కేర్ యూనిట్ కు తీసుకువెళ్ళాలి.

No comments: