అన్నం ఉడికింది ,లేనిది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలని అందరూ చెప్తుంటే నేనూ చాలనే అనుకున్నాను.నేను వంట మొదలు పెట్టిన తరువాతే ఆ statement తప్పని తెలిసింది.నలపాయ పడితే పైన ఉడికినా మధ్యలో బియ్యం ఉడకకుండా గింజలు గానే ఉంటుంది.(ఇప్పుడు కుక్కర్లు వచ్చినవి కనుక ఆ అవసరం లేదనుకోండి).ఈ ఒక్క విషయమనే కాదు,మనం నిత్యం చాలానే విషయాలలో తొందరపడి తప్పుడు statements ఇస్తూ ఉంటాము.మనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యీ అవగానే అతని కులాన్ని బట్టో,లేకపోతే అతను ఏ ప్రాంతం వాడో ,ఆ ప్రాంతాన్ని బట్టి అతని గుణగణాల్ని అంచనా వేస్తూ ఉంటాము. అలాగే ప్రతీ విషయాన్నీ జనరలైజ్ చేస్తూ ఉంటాము....ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు ,మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు.
ఫలానా జిల్లా వాళ్ళందరూ మోసగాళ్ళు.ఫలానా కులం వాళ్ళందరూ
పొగరుబోతులు. మాత్రుమూర్తులందరూ గొప్ప త్యాగమూర్తులు.(మరి రోడ్ల మీద,తుప్పల్లో,చెత్తకుండీల్లో రోజుల పసికందులు ఎందుకు దొరుకుతున్నారో తెలియదు)etc .,etc .,ఒక వ్యక్తి గొప్ప గా ప్రవర్తించినా ,నీచంగా ప్రవర్తించినా ,అది ఆ వ్యక్తి కే పరిమితం చేయకుండా మొత్తం జాతి కి ఆపాదిస్తాం.
మనం దేనినయినా జడ్జ్ చేసేటప్పుడు ఏదో ఒక విషయమే పరిగణన లోకి తీసుకొని చేయకూడదని తెలిపే ఈ కథ చదవండి.
ఒక ఊరిలో ఒక వ్యక్తి కి నలుగురు కొడుకులు ఉన్నారు.తండ్రి, వాళ్ళకి ఏ విషయం లో కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు.నలుగురు కొడుకుల్ని ఎక్కడో దూరాన ఉన్న 'pear ' చెట్టు ను చూసి వచ్చి ఎలా ఉందో చెప్పమన్నాడు.ఒకరు వెళ్లి వచ్చినాక ఇంకొకరు అలా నలుగురు వెళ్లి చూసివచ్చారు.పెద్ద కొడుకు....చెట్టు అంతాఎండిపోయినట్టు ఉంది.ఒక్క ఆకు కూడా లేదు,ఆ చెట్టు చచ్చి పోవచ్చు అని చెప్పాడు.
రెండో కొడుకు.....చెట్టు చాలా పచ్చగా ఉంది.కొత్త చివుళ్ళ తో అని చెప్పాడు.
మూడో కొడుకు ...పూలు విరగబూసి ,చెట్టు ఎంతో అందం గా ఉంది అని చెప్పాడు.నాలుగో కొడుకు....కాయలు,పళ్ళతో నిండి ఉంది అని చెప్పాడు.అప్పుడు తండ్రి మీ నలుగురు చెప్పింది కరక్టే,కానీ నలుగురు నాలుగు 'seasons ' లో వెళ్లి చూడటం వల్ల మీ నలుగురి అభిప్రాయాలు నాలుగు రకాలు గా ఉన్నాయి.కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఒక్క విషయం మీద బేస్ అయ్యి తీసుకోకూడదు అని చెప్పాడు.
we cannot judge a person or tree by only one season ,and that the essence of who they are,and the pleasure,joy and love that come from that life can only be measured at the end,when all the seasons are up. if you give up when it is winter ,you will miss the promise of your spring,the beauty of your summer,fulfillment of your fall.So don't let the pain of one season destroy the joy of all the rest.Don't judge life by one difficult season.

No comments:
Post a Comment