ఆడుకోటానికి వెళ్ళిన మా అమ్మాయ్,అమ్మా అన్నం చేసావా?ఆకలేస్తుంది అంటూ వచ్చింది.అన్నం చేసావా ఏంటి?ఏం భాష అది?అన్నం వండావా అనాలి అన్నాను నేను.
ఆ...అదేలే చేసావా?మా అమ్మాయి.
మళ్ళీ అదే మాట...నేను
ఏదోలే అమ్మా ,నాకు అన్నం పెట్టు ఆకలి గా ఉంది అంది మా అమ్మాయి.
ఏం బాష,ఆ....అదేలే,ఏదోలే ఈ టైపు సంబాషణ మా ఇంట్లో ప్రతి రోజూ మాక్జిమం ఎన్నిసార్లో చెప్పలేను కానీ మినిమం ఒక్కసారైనా వుంటుంది.
నా జుట్టులు ఊడిపోతున్నాయి,ఏదో ఒకటి చెయ్యమ్మా అంటుంది.
జుట్టులు కాదు.......వెంట్రుకలు అనాలి అని నేను అంటే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అన్నట్లు ఆ...అదేలే అని మా అమ్మాయి రొటీను సమాధానం.
పెరుగు కొంచం పులిసినట్లున్నా ఈ పెరుగు కుళ్లిపోయింది, నాకొద్దు అంటుంది.
కూరగాయలు,పళ్ళు అయితే కుళ్ళిపోయాయి అంటారు,పెరుగు పులిసిపోయింది అనాలి అని నేనంటే తన రొటీన్ డైలాగ్ వదులుతుంది.
పెరుగు వేసేటప్పుడు కొత్తదా,పాతదా అని అడుగుతుంది.
పెరుగు కొత్తదా,పాతదా ఏంటే,నీ బాష తో నన్ను చంపుతున్నావు-నేను
తన దృష్టిలో కొత్తది అంటే మధ్యాహ్నభోజనం లోకయితే పొద్దున్న తోడుపెట్టినది,రాత్రి భోజనం లోకి అయితే మధ్యాహ్నం తోడుబెట్టినది . ముందు రోజు తోడుపెట్టినది అయితే పాత పెరుగు.ఆ పెరుగు వేసుకోదన్నమాట.
మా అమ్మాయి మాటలు ఇలా ఉంటే ,మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ప్రతి దానికి దొరికింది అనే మాట వాడుతుంది.
మచ్చుకు కొన్ని......
నాకు రన్నింగ్ రేస్ లో సెకండ్ ప్రైజ్ దొరికింది.
ఇవాళ సాకేత్ బర్త్డే ,అందరికీ ఒక చాక్లేటే,నాకు రెండు చాక్లెట్లు దొరికాయి.
నేను విన్నప్పుడు సరిచేస్తూ ఉంటాను.
ఒకరోజు స్కూల్ నుంచి నాకు రోప్ దొరికిన్దంటూ వచ్చింది.రోప్ దొరకటం ఏమిటి?ఎక్కడ దొరికింది అని అడిగాను నేను.అమ్మ ఫిఫ్టీన్రూపీస్ ఇచ్చిందా,టెన్ రూపీస్ కి ఈ రోప్ దొరికింది.
బాడ్జ్ ఫైవ్ రూపీస్,బాడ్జ్ దొరకలేదు ,అందుకని చాక్లెట్ కొనుక్కొని తిన్నాను అంది.డబ్బులు పెట్టి
కొనుక్కున్నావు కదా,రోప్ కొనుక్కున్నాను అనాలి,
దొరికిందని అనకూడదు అని చెప్పాను. అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ని సప్పోర్ట్ చేస్తాడు.వాళ్ళ అమ్మాయి మాటలన్నీ కరక్టే అంటాడు.హిందీ లో ప్రైజ్ మిలా అంటారు,అంటే దొరికిందనే కదా అర్ధం.ప్రైజ్ వచ్చిందన్నా ,దొరికిన్దన్నా ...ఏదైనా కరెక్టే అని వాదిస్తాడు.సరే వాళ్ళ నాన్నే అలా మాట్లాడుతుంటే ,ఇంక ఆ అమ్మాయి ఏమి నేర్చుకుంటుందిలే అని నేను వదిలేసాను.దేవుడి ని వేడుకుంటున్నాను.......నేను తెలుగు మర్చిపోవటమో, మా పిల్లలు సరైన తెలుగు మాట్లాడటమో ...ఈ రెండిటి లో ఏదో ఒకటి చేయమని.ఈ రెండిటి లో మొదటి కోరిక నేరవేర్చటమే దేవుడికి కూడా ఈజీ అనుకుంటా.
3 comments:
ఖూనీ కాదు మేడం, హత్య
The poem is a wow...
ముందునాకు ఆ ఇంగ్లీషు మాతృక పంపించండి చెబుతాను,
Anu,
Yes,I understand your mother's heart and apriciate your respect for mother tongue, any language,pronunciation,vocabulary,aplication of right words.language sophistication,depends on parents at intial stage and on the kind of society child remains most of the time in a day,I have seen parents encouraging "filmy" telugu as matter of an art,today I doubt in our industry any actor of this generation is able to play those roles of their sucessor,we need to re store the previous glory of this language.
Post a Comment