Sunday 8 January 2012

శీతాకాలం లో చర్మం పొడిబారకుండా...


శీతాకాలం లో సాధారణం గా అందరూ ఎదుర్కొనే సమస్య, చర్మం పొడిబారటం.మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు వాడటం ఒక పరిష్కారం.అలా కాకుండా మనం తినే ఆహార పదార్ధాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


నీరు :  వేసవి లో శరీరానికి అవసరమైనంత నీరు తాగుతాము కానీ,శీతాకాలం వచ్చేటప్పటికి ఎక్కువ దాహం వేయని  కారణం గా తగినంత నీరు తీసుకోము.చర్మం పొడిబారకుండా ఉండాలంటే సీజన్ తో సంబంధం లేకుండా సరిపడా నీరు తాగటం అవసరం.


శీతాకాలం లో ఎంత నీరు త్రాగాలి అన్నది,

gender and activity levels of the person మీద ఆధారపడి ఉన్నది.

సుమారుగా  తీసుకోవాల్సిన  పరిణామం:

మగవారు:8-10 గ్లాసులు 
ఆడవారు: 6-8 గ్లాసులు 
 వ్యాయామం చేసే మగవారు:12-14 గ్లాసులు

 వ్యాయామం చేసే ఆడవారు:10-12గ్లాసులు 

పాలిచ్చేతల్లులు : 7-10గ్లాసులు



అంత నీరు తాగాలంటే కష్టం .ఎలా ?అని అనుకుంటున్నారా?
కేవలం నీరే తాగాలని లేదు.ఇతర ద్రవ పదార్దాలయినా తీసుకోవచ్చు.
ఉదాహరణ కి హెర్బల్ టీ,సూప్స్.ఇవి ఆరోగ్యానికి మంచిదే కాక,శరీరం లో తేమ ను కాపాడుతాయి.

స్టీం బాత్ కూడా వంట్లో తేమ ను పెంచడానికి ఉపయోగ పడుతుంది.


విటమిన్ ఎ,సి ,ఇ, Omega-3 fatty acids ఉన్న ఆహార పదార్ధాల ను ఎక్కువ గా తీసుకోవటం వల్ల కూడా చర్మాన్ని పొడిబారకుండా సంరక్షించుకోవచ్చు.విటమిన్ సి ,శరీరం లో collagen (a strong yet flexible protein which provides elasticity and also helps seal moisture into the skin) పెంచటానికి ఉపయోగపడుతుంది.


last but not least స్నానానికి సబ్బు ఉపయోగించకుండా సున్నిపిండి వాడటం.

3 comments:

Unknown said...

చాలా బాగా చెప్పారు.నాకొక సందేహం ..రోజ్ వాటర్ ని వేసవి లో మొహానికి రాసుకోవడం నాకు అలవాటు..కాని అది పోడిబారేలా చేస్తుంది అని విన్నాను..నిజమేనా?కాదు..అది మంచి మాయిశ్చరైజర్ అని నా అభిప్రాయం...ఏది కరెక్టో తెలుపగలరు?

Anuradha said...

మీ అభిప్రాయం సరైనదే శ్రీనిధి గారు .రోజ్ వాటర్ సరిపడకపోతే తప్పించి(ఎలర్జీ) వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు.

Unknown said...

థాంక్స్ అండి.ఒక్కొక్కసారి అవతలి వారు చెప్పేది తప్పు అని తెలిసినా కూడా మనం ఏమి చెప్పలేని పరిస్థితి.ముఖ్యంగా అత్తవారి వైపు భందువులతో.సందర్భం కాకపోయినా..అడగాలనిపించింది.వాదించలేము అలాగని విని ఉర్కోలేము.అప్పుడెలా?