నిండు నూరేళ్ళు అని కదా అంటారు ,ఈ నాలుగేళ్ళు ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ బ్లాగ్ మొదలెట్టి నాలుగేళ్ళు అయ్యింది.అదన్నమాట సంగతి. అసలు బ్లాగ్ మొదలు పెట్టింది ఊహలు-ఊసులు అనే పేరుతో . మొదటి పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది నెలలకు, పాపం నూకలు చెల్లి పోయాయి (జి మెయిల్ అకౌంట్ డెలీట్ చెయ్యటం తో )ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని ఊరట చెందాను.ఒక ఆరు నెలలకు మళ్లీ కొత్త పేరుతో ప్రాణం పోసుకుంది . అలా డెలీట్ చెయ్యటం వల్ల మంచి ,చెడు రెండూ కలిగాయి . కీడెంచి మేలెంచమన్నారు కదా ,అందుకని ముందు
చెడు - పోస్ట్లయితే ఎక్కువ శాతం సేవ్ చేసుకోగలిగాను కాని ,కామెంట్లు చాలా వరకూ పోయాయి. పోస్ట్స్ లో ఉన్న పిక్చర్స్ పోయాయి. నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన మొదటి పోస్ట్ ఝాన్సీ ,వోర్చా ,గ్వాలియర్ కోట ల పిక్చర్స్.
అవన్నీ పోయాయి. సో పోస్ట్ కూడా గాయబ్ :)
ఈ నాలుగేళ్ళు గా నా బ్లాగ్ చదువుతున్నవారికి ,కామెంట్లు పెడుతున్నవారికి ,కామెంట్లు పెట్టని వారికి ,బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి అందరికీ ధన్యవాదాలు.
Hoping
I can celebrate many more such birthdays for this blog ...
3 comments:
గుడ్ గుడ్ అభినందనలు :-)
మీ బ్లాగ్ కి శుభాకాంక్షలు అనురాధ గారు radhika (nani)
వేణు గారు,రాధిక గారు
థాంక్యూ :))
Post a Comment