Sunday 16 February 2014

అస్సాం స్టేట్ మ్యూజియం

కళాక్షేత్ర తర్వాత చూడదగ్గది అస్సాం స్టేట్ మ్యూజియం.అస్సాం తెగల జీవన విధానాన్ని తెలిపే బొమ్మలు కళాక్షేత్రలో ఉన్నవి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి.తవ్వకాలలో బయల్పడ్డ 10 మరియు 13 వ శతాబ్దం నాటి శిల్పాలు ,రాగి నాణేలు ,రెండవ ప్రపంచ యుద్ధం లో వాడిన ఆయుధాలు ఇక్కడ చూడవచ్చు. ఒక రూం మొత్తం గాంధీ తాత కి కేటాయించబడింది. చిన్నప్పటి ఫోటో లు,పెళ్లి అయిన కొత్తలో కస్తూరిబా తో కలిసి దిగిన ఫోటో ,చనిపోయినప్పుడు ,వేరే నాయకులతో దిగిన ఫోటో లు ఉన్నాయి.గాంధీ గారు రాసిన ఉత్తరాలు,ఆయనకు ఇతరులు రాసిన ఉత్తరాలు కూడా ఇక్కడ చూడొచ్చు.అన్ని ఉత్తరాలు చదవలేదు ,చదివిన వాటిలో ఒకటి -  గాంధీ గారు విజయవాడ లోని ఒకరికి విడాకుల విషయమై సలహా ఇస్తూ రాసినది ఉంది.కొన్ని ఫోటోస్ తీయటానికి పర్మిషన్ లేదు ,పర్మిషన్ ఉన్నవాటిలో కూడా కొన్నే తీసాము . అక్కడ తీసిన కొన్ని ఫోటో లు . 

స్నేక్ పిల్లర్










    






2 comments:

Unknown said...

చాలా ఆసక్తికరంగా ఉండండి...ఎన్నో తెలీని విషయాలు తెలుసుకోవచ్చు...ఒకసారి నా బ్లాగ్ ని చూసి మీ అభిప్రాయం తెలియచెయ్యండి...ధన్యవాదాలు
www.sayamkalamkaburlu.com

Anuradha said...

థాంక్యూ శ్రీనిధి గారు. మీ బ్లాగ్ చూసాను ,బావుంది అండి.