Saturday 13 September 2014

అనూరాధ /అనురాధ ?

 
 
 
అనూరాధ /అనురాధ  ఈ రెండిటిలో ఏది కరెక్ట్ ? అసలే దేశం మరియు ఆంధ్ర రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంటే ఈ సమస్య (అసలు సమస్యేనా ?) ముఖ్యమా ? ఇన్నాళ్ళూ ఈ సందేహం రాలేదు .అనూరాధ అనే రాస్తున్నాను . ఈ మధ్యే తెలిసింది ,అనూరాధ  అని రాయటం తప్పు అనురాధ అని రాయాలి అని . నివేదన సంపాదకులు రవికృష్ణ గారు  చెప్పారు . మీ పేరుకు అర్ధం తెలుసా అని అడిగితే , నేను - అర్ధం ఏముంటుంది ?ఒక నక్షత్రం పేరు అని చెప్పాను . అనూరాధ  అని రాయకూడదు అంటే బుక్స్ లో నక్షత్రం పేరు అలాగే రాస్తారు కదండీ అన్నాను . బుక్స్ లో తప్పు రాస్తున్నారు , అను రాధ  అంటే రాధను అనుసరించునది . అలా రాయటమే కరెక్ట్ అని చెప్పారు . ఒకరిని అనుసరించే వారిని అనుచరుడు అంటాము కానీ అనూచరుడు అనం కదా ? అలాగే మీ పేరు అన్నారు . వినటానికి సమంజసం గానే ఉన్నా ఒక విధం గా రాయటానికి అలవాటు పడ్డాక అంత తొందరగా మార్చుకోవటం కష్టమేమో ?

 
 

4 comments:

sarma said...

అనూరాధ తప్పు మీ పేరు అనురాధ గానే చెప్పుకోవాలి. నా కామెంటర్లలో ఒకరి పేరు అనురాధ. వారిని నేను అనురాధ అని మాత్రమే సంబోధిస్తాను. పేరు తప్పు రాసుకోకూడదండీ.

విన్నకోట నరసింహా రావు said...

నిఘంటువు లో (ఆంధ్రభారతి) అయితే రెండు పదాలూ ఇచ్చారు.

Anuradha said...

థాంక్యూ శర్మ గారు.ఇంతకుముందు తెలియదు కాబట్టి తప్పు గా రాసాను,ఇప్పుడు రాయనులెండి .

Anuradha said...

నరసింహారావు గారు,మళ్ళీ సందేహం లో పడవేసారు :)