Wednesday, 21 December 2016

కర్ణాటక కోవెల యాత్ర - గోకర్ణ ,మురుడేశ్వర్

ఉడిపి నుంచి గోకర్ణ ,మహాబలేశ్వర్ గుడికి వెళ్ళాము.ఈ గుడిని కదంబ వంశానికి చెందిన మయూరశర్మ 4వ శతాబ్దంలో నిర్మించాడు.కాళిదాసు రచించిన రఘువంశలో గోకర్ణ ప్రసక్తి ఉందట.ఉందట,అని ఎందుకన్నాను అంటే రఘువంశము నేను చదవలేదు 😊 మహాబలేశ్వరుడుని, గణపతి ని తామ్ర గౌరిని దర్శించుకుని మురుడేశ్వర్ వెళ్ళాము .
పురాణ గాథల ప్రకారం , రావణాసురుడి తల్లి  పూజించే శివలింగాన్ని ఇంద్రుడు తస్కరించి సముద్రంలో కి విసిరేశాడట.రావణాసురుడు , కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తెచ్చి  ఇస్తానని మాట ఇచ్చాడు.ఇచ్చిన మాట ప్రకారం కైలాసానికి వెళ్లి తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆత్మ లింగాన్ని ఒక షరతు తో పొందాడు.ఆ షరతు - గమ్యం చేరేవరకు నేలపై పెట్టకూడదు. దేవతలు ,ఆ శివలింగాన్ని రావణాసురుడికి దక్కకుండా చెయ్యటానికి వినాయకుడుని గోవులకాపరి వేషంలో పంపిస్తారు.విష్ణువు సూర్యాస్తమయం అయినట్లు భ్రమింపచేస్తాడు. సంధ్యావందనం చేసుకోవాలని , రావణాసురుడు బాలుని వేషం లో ఉన్న వినాయకుడికి శివలింగాన్ని పట్టుకోమని ఇచ్చి తాను వచ్చెంతవరకు నేలపై పెట్టవద్దని చెప్తాడు.వినాయకుడు రావణాసురుడిని మూడుసార్లు పిలిచి,రావణాసురుడు వచ్చేలోపే నేలపై పెట్టాడు.కోపంతో ఆ బాలుని తలపై మొట్టాడు అంట.గోకర్ణ లో ఉన్న వినాయకుడి విగ్రహం,మాడు అణిగి ఉంటుంది. ఆ శివలింగాన్ని పెకలించటానికి ప్రయత్నించినా రాలేదు.5ప్రదేశాలలో ముక్కలు పడ్డాయట.అవి మురుడేశ్వర్ ,సజ్జేశ్వర్,దారేస్వర్,గుణవంతేశ్వర్.వీటిలో గోకర్ణ కాకుండా మురుడేశ్వర్ ఒకటి దర్శించుకున్నాము.ఈ కథ అంతా,మానవ నిర్మిత గుహ (భూకైలాష్ గుహ)మురుడేశ్వర్లో బొమ్మల రూపం లో  ఉంది.










        

మురుడేశ్వర్ 
ఈ ఆలయ గోపురం 18 అంతస్తులు , లిఫ్ట్ లో వెళ్ళొచ్చు. 






గోపురం పై నుంచి వ్యూ 






Friday, 16 December 2016

ఒక వాట్సాప్ సందేశం

మనం ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తూ ఉంటాము.ఎవరు ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం😊 సోషల్ మీడియాలో కూడా రోజూ కొన్ని వందల సుభాషితాలు పోస్ట్ చేస్తూ ఉంటారు.గతం గురించి మర్చిపో,వర్తమానంలో జీవించు అని.వాటి దారి వాటిదే, మన దారి మనదే.బ్రతికి ఉన్నప్పుడు ఏం  చేస్తున్నారో పట్టించుకోము.చనిపోయినాక తీరిగ్గా లోపాలు వెతుకుతూ చర్చించుకుంటాము 😊 ప్రస్తుతం ఇక్కడ పోస్ట్ చేస్తున్న సందేశం వర్తమానం లోనిదే.ఇందులో చెప్పినట్లు సమాచారం తెలుసుకునే హక్కు అందరికి ఉంది 


వాట్సాప్ సందేశం :
         
Message to the Nation from PM N@M0:
*मित्रों (friends), my government has completed 700 days.*
*Here are my achievements...*

🔹Railway platform ticket was ₹3 
and it's ₹10 today.
🔹Unlimited Net came in a package of ₹98 
and today it comes in ₹246. 
🔹Earlier the call rate was 30p per minute and today, it is ₹1.
🔹When Crude oil was $119 a barrel, petrol was available at ₹67 a litre 
and today though crude oil is down to $30 a barrel, I am giving petrol at ₹60 per litre.
🔹Earlier dal was ₹70 
and it's ₹150 today.
🔹Service Tax was 12.36% 
it's 14.5% today.
🔹Excise Duty today is 12.36% 
it was 10% earlier.
🔹Be sure to check the Balance Sheet of all the undertakings.
🔹Dollar rate was ₹58.50, 
today is ₹68.50
🔹To eliminate gas subsidies of ₹100 crs, 
I had to spend ₹250crs for advertising.
🔹I gave ₹250crs for the Swachta advertising campaign, 
but I do not have ₹35crs for the salaries of sanitation personnel.
🔹I am giving Kissan TV Channel ₹100crs annually 
as this channel is an organization of the RSS Advisory staff.
🔹I express my helplessness in snatching away the subsidies to farmers.
🔹I have ₹500crs for Yoga Day and annual emoluments for Ramdev to teach yoga in Haryana state schools is ₹700crs.
🔹I have no money for school primary education and had to cut the budget by 20%.
🔹I have offered ₹64,000crs as Corporate Tax Relief, 
but I can't offer ₹15,000crs to repay the loans of the farmers who are committing suicides.
🔹For Skill India I have ₹200 crs of advertising budget, 
but the scholarships for youth was cut by ₹500crs because they did not say 'Bharat Mata Ki Jai'.
🔹Government has losses, and the tender has been passed for Indian railways to sell land because ₹22,000crs must be paid to Adani.
🔹Mallya leaving the country defaulting on ₹9,000 cr loan is no matter 
as it is only ₹75 per citizen.
🔹My dream of Achce din has come true .. 
_((for ME, my Party and my Capitalist Friends..))_

You have all the right information and the achievements of my government.
Please forward this to all the people.

Only more thing: 
I have time for an election rally in Agra 
but closeby, just some distance  from there, I couldn't visit the scene of the Kanpur railway accident.
Only 144 people died anyway.

But I need not have shame or fear 
because my Bhakts are blind;
they have unthinking devotion 
and will mindlessly support me.

If you don't support me,
you are definitely Anti-National
and should leave the country.

भारत माता की जै !



Saturday, 10 December 2016

అంగట్లో అన్నీ ఉన్నా ...


ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది.ఇప్పుడు ఆ సామెతను అంగట్లో అన్నీ ఉన్నా అందరి నోట్లో శని అని మార్చుకోవాలేమో.నవంబర్,8-500,1000నోట్లు రద్దు అన్న వార్త విని,మొదటపర్వాలేదులే, ఈ నెల ఇంకా డబ్బులు విత్ డ్రా చెయ్యలేదు,ఇంట్లో ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి మార్చుకోవటానికి అంత  ఇబ్బంది పడక్కరలేదు అనుకున్నా.ఉన్న డబ్బులు మార్చుకోవటానికి ఇబ్బంది పడలేదు కానీ, ఉన్న డబ్బులు తీసుకోవటానికే ఇబ్బంది 😀నెలయ్యింది,ఇంతవరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవటానికి కుదరలేదు.ఇంటికి దగ్గరలో,ATM లు ఉంటానికి ఒక అరడజను ఉన్నాయి, కానీ నెలనుంచి  "out of service" " No cash "  అన్న బోర్డులు ... రోజూ వెళ్ళటం , ఆ బోర్డులు చూసి తిరిగి వచ్చెయ్యటం -ఇదే పని. బాంక్ కి వెళ్లి తెచ్చుకోవటానికి , క్యూలు చూసి భయం తో వెళ్ళలేదు.నిన్న భయాన్ని ఊరం పెట్టి బాంక్ కి వెళితే , అక్కడ కూడా కాష్ లేదు , మంగళవారం వరకు రాదు. మంగళవారం వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఆ రోజైనా దొరుకుతుందో లేదో తెలియదు.ఇవాళ న్యూస్ లో చూసాను,ఒక అధికారికి చెందిన కారులో కొత్త నోట్లు-24 కోట్లు  దొరికాయంట.ఇంకెక్కడో 84 లక్షలు ... నేను 2000 రూపాయలు  తెచ్చు కోవటానికే నానా అవస్థలు పడుతున్నాను. 😓 










    

Wednesday, 23 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - కటీల్ ,ఉడిపి

మంగళూరుకి 29కి.మీల దూరంలో ఉన్న కటీల్ లో దుర్గాపరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు.పూర్వం , ఒకానొక కాలం లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనటం తో , జాబాలి అనే మహర్షి , యజ్ఞం చేయ తలపెట్టాడు. యజ్ఞానికి కావాల్సిన హోమధేనువు కోసం   ఇంద్రుడు వద్దకు వెళ్లగా , ఇంద్రుడు నందిని అనే ఆవును తీసుకెళ్లమని చెప్పగా , జాబాలి నందిని వద్దకు వెళ్లి భూమి కి రమ్మని కోరాడు.నందిని అందుకు అంగీకరించక పోవటంతో,కోపించి నందిని ని నది గా మారి భూమి మీద ప్రవహించమని శపించాడు.నందిని క్షమించమని వేడుకోగా, జాబాలి - శాపవిమోచనకు ఆదిశక్తిని ప్రార్ధించమని చెప్పగా,నందిని- అమ్మవారిని ప్రార్ధించిందట.దేవి,శాప విమోచనం సాధ్యం కాదని, తాను అక్కడ కొలువై ఉంటానని చెప్పారట. నందిని నది పుట్టిన స్థానానికి,సముద్రం లో కలిసే ప్రదేశానికి మధ్యలో అమ్మవారు వెలిశారు,అందుకని ఈ ప్రదేశానికి కటీలు అని పేరు . 




నందిని నది

అమ్మవారిని దర్శించుకుని , తిరిగి మంగళూరు చేరుకున్నాము. మరుసటి రోజు ప్రొద్దున్న ఉడిపి వెళ్లి , కృష్ణుడిని దర్శించుకుని , లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , సాయంకాలం Malpe బీచ్ కి వెళ్ళాము.సూర్యాస్తమయాన్ని చూసి తిరిగి బసకి   చేరుకున్నాము.కొంతమంది బీచ్ కి రాము అని చెప్పి, సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లారు.వాళ్ళు, పూజ చాలా బాగా చేశారు, దీపాలు వెలిగించి వచ్చాము ,అని చెప్పటం తో అయ్యో , అనవసరం గా బీచ్ కి వెళ్ళాము అని కొంతమంది బాధ పడ్డారు.మా టూర్ ఆపరేటర్- గోకర్ణ ,మురుడేశ్వర్ చూసి మళ్ళీ ఉడుపి వస్తాము,అప్పుడు వెళ్ళండి అని చెప్పారు.    



13వ శతాబ్దం లో మద్వాచార్యుల వారు, ఇక్కడ కృష్ణ మఠం స్థాపించారు.కనకదాస అనే భక్తుడు , కృష్ణమఠానికి ఎదురుగా ఉండేవాడు. అస్పృస్యుడు అనే కారణం తో గుడిలోకి రానివ్వని కారణం గా ,తూర్పు ముఖానికి ఉన్న విగ్రహం పశ్చిమానికి తిరిగిందట.కనకదాస పేరు మీదుగా ఈ ద్వారానికి కనకన ఖిండి అని పేరు.ఈ ద్వారం నుంచి ప్రవేశం నిషిద్ధం. ఈ ద్వారానికి ఎదురుగా కనకదాస విగ్రహం ఉంది.       





   స్వామిని నేరుగా దర్శించటానికి లేదు. ఈ కిటికీ (నవగ్రహ కిటికీ) నుంచి దర్శనం చేసుకోవాలి .


చంద్రమౌళీశ్వర ఆలయం 

 Malpe beach



బీచ్  ఎంట్రన్స్ వద్ద ... 



Wednesday, 16 November 2016

మొన్నటి చంద్రుడు



ప్రత్యేకించి చంద్రుడిని చూడాలని చూడకపోయినా ,చందమామ పలు రూపాలని చాలా సార్లే చూసాను. చిన్నతనం లో మరీ ఎక్కువ గా. వేసవి కాలం లో , సాయంకాలం అవగానే సూర్యుని ప్రతాపానికి కాలిపోతున్న నేల తల్లిని చల్లార్చటానికి,పెరట్లో బకెట్లకు బకెట్లు నీళ్లు చల్లి ,ఆ తర్వాత వరసనే మంచాలు ... 6:30 , ఏడింటి కల్లా భోజనం చేసి పిల్లలమంతా మంచాల మీదకు చేరి కబుర్లు చెప్పుకోవటం , అదొక అద్భుతమైన జ్ఞాపకం. చుక్కల్ని చూసి వాటికి రకరకాల రూపాల్ని ఆపాదించటం , చందమామ లో కుందేలు ఉంటదన్నారు,మచ్చ ఉందన్నారు , ఏదీ కనపడటం లేదే ... ఇలా . ఏం మాట్లాడుకునేవాళ్ళమో పూర్తిగా గుర్తు లేదు కానీ , ఆ కబుర్లకు అంతు అంటూ ఉండేది కాదు . అప్పట్లో చందమామ లో ఉన్న మచ్చలు ఏమి కనిపించలేదు - ఇప్పుడు చాలానే కనిపిస్తున్నాయి , బహుశా ఈ భూమి మీద మనం పొంగి పొర్లిస్తున్న కాలుష్యం కావొచ్చు లేదా చందమామ మనకి చాలా దగ్గరగా వచ్చి  ఉండొచ్చు. ఇంకొన్నాళ్ల తర్వాత , సిటీ లో ... వేసవి లో రోజూ టంచన్ గా ఏడింటికి కరెంట్ పోయేది,మళ్ళీ కరెంట్ వచ్ఛేలోపు భోజనాలు పూర్తిచేసి అంత్యాక్షరి ఆడేవాళ్ళం.అదే పౌర్ణమి రోజయితే ఆనందానికి హద్దు ఉండేది కాదు,ఎందుకంటే,గుడ్డివెల్తురులో,ఉక్కపోత భరిస్తూబొంచెయ్యక్కరలేదు.హాయిగా వెన్నెల్లో  హాయ్ హాయ్ అనుకుంటూ ప్రశాంతం గా తినొచ్చు.ఇక అపార్టుమెంట్లు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా చూడటం తప్ప చంద్రుణ్ణి చూడటం పూర్తిగా మర్చేపోయాను.ఈ మధ్య ఫలానా రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు, భూమికి దగ్గరగా వస్తాడు, పెద్దగా కనిపిస్తాడు , చూడండి , మిస్ అవ్వొద్దు అని అందరూ పదే పదే   ఊదరగొడుతుంటే , ఎలా ఉంటుందో తప్పక చూడాలి , మిస్ కాకూడదు అనుకుంటే , మొదటిసారి చెప్పినప్పుడు ఆకాశం మబ్బులు పట్టేసి అసలు చంద్రుని దర్శనమే అవలేదు.నిన్న మాత్రం చూడగలిగాను.నాకు,చంద్రుడు మరీ అంత పెద్దగా ఏమీ అనిపించలేదు.అంతకుముందు, పర్లి నుంచి తిరిగి వచ్చేప్పుడుట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండటం తో , ఏమి తోచక -  మాఘ పౌర్ణిమ రోజు చంద్రుడిని  ఫోటోలు తీస్తూ టైం పాస్ చేసాను.ఒక్క రంగులో తప్పించి, అప్పటి చంద్రుడికి , మొన్నటి చంద్రుడికి తేడా ఏమి లేదు 😊  



మాఘ పౌర్ణిమ చంద్రుడు 


మొన్నటి చంద్రుడు 


బాక్ లైటింగ్ చేంజ్ చేస్తే ఇలా ... 


Tuesday, 8 November 2016

కర్ణాటక కోవెల యాత్ర- ధర్మస్థల



మూడో రోజు ,ధర్మస్థల కి ప్రయాణం. మంజునాథ స్వామి ఆలయం.
800 ఏళ్ల క్రితం,కుడుమ(ఇప్పటి ధర్మస్థల)అనే గ్రామంలో బిర్మన్నపెరగాడే అనే దంపతులు నివసించేవారు.దేవతలు,ధర్మ పరిరక్షణకు అనువైన స్థలం వెదుకుతూ, కుడుమ గ్రామానికి వచ్చారంట. బిర్మన్న దంపతుల ఆతిధ్యానికి మెచ్చి , కలలో కనిపించి - వారు ఉంటున్న ఇంటిని దేవతలను కొలవటానికి ఉపయోగించమని చెప్పారంట.దాని ప్రకారమే వారు ఆ ఇంటిని ఖాళీ చేసి దేవతలను(కాలరాహు,కుమారస్వామి,కన్యాకుమారి)ప్రతిష్టించి పూజలు జరపటం ప్రారంభించారట.పూజా కార్యక్రమాలు నిర్వహించే వారి కోరిక మేరకు శివలింగాన్ని ప్రతిష్టించారట.
చాంతాడంత క్యూ.200రూపాయల టికెట్ తీసుకున్నాము.వృద్ధులు,అంగవైకల్యంఉన్నవారు క్యూలో  కాకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు.మాకు దర్శనం చేసుకోవటానికి మూడున్నర గంటలు పట్టింది.  

గుడి వెలుపల (వెళ్లే దారి లో )వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన రథాలు,పాతవి  ఉన్నాయి . ఎంతో అందం గా ఉన్నాయి. 

గంగాధర స్వామి రథ,శ్రీరంగపట్నం

  

అమృతేశ్వర రథ,హాసన్ 

మల్లేశ్వర స్వామి రథ,బళ్ళారి 








దర్శనం చేసుకుని,అక్కడే లంచ్ చేసి కటీలు కి వెళ్ళాము . వివరాలు తర్వాతి పోస్ట్ లో . 



Tuesday, 1 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - మంగళూరు

కుక్కే నుంచి మంగళూరు కి ప్రయాణం

మంగళూరు లో మొదటగా మంగళాదేవి మందిరానికి వెళ్ళాము.అమ్మవారి పేరు తోనే ఈ ఊరు - మంగళాపురం  గా పిలువబడి ,కాలక్రమం లో మంగళూరు గా స్థిరపడింది. 9వ శతాబ్దం లో , అలుప వంశానికి చెందిన కుందవర్మన్ ఈ ఆలయాన్ని , కేరళ గుడుల నిర్మాణ శైలి లో కట్టించాడు  అని ఒక కథనం. ఇంకో కథనం ప్రకారం ,పరశురాముడు నిర్మించగా - తర్వాతి కాలం లో  కుందవర్మన్ విస్తరించాడని.






















అక్కడ్నుంచి,కుడ్రోలి గోకర్ణాథేశ్వరక్షేత్రానికి వెళ్ళాము.మొట్టమొదట నారాయణ గురు ఆధ్వర్యాన , కోరగప్ప 1912 వ సంవత్సరం లో నిర్మించారు . రెనోవేషన్ తర్వాత 1991 లో రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.ఈ క్షేత్రంలో శివునితో పాటు గణపతి,సుబ్రహ్మణ్యస్వామి,అన్నపూర్ణ,భైరవ,శని,కృష్ణ,నవగ్రహాలమందిరాలు కూడా ఉన్నాయి.హనుమాన్ మందిరాన్ని 2007 లో నిర్మించారు . 


    












Monday, 31 October 2016

కర్ణాటక కోవెల యాత్ర

అక్టోబర్ 13న - బెంగళూరు ఎక్స్ప్రెస్ ,కాచిగూడ రైల్వే స్టేషన్ సాయంకాలం ఏడింటికి ప్రయాణం . అంతకుముందు రోజు , ఆ ట్రైన్ 2 గంటలు ఆలశ్యం  అని చూసి,ఇవాళ ఎన్ని గంటలు ఆలశ్యం అవుతుందో అనుకున్నాను కానీ , సరి అయిన సమయానికే బయలుదేరింది.
గమ్యం చేరటం - నాలుగు గంటలు ఆలశ్యం .
బెంగళూరు నుంచి మైసూర్ చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది.మా టూర్ ఆపరేటర్ ,బాగా ఆలశ్యం అయ్యింది -ముందు లంచ్ చెయ్యండి ,తర్వాత రూమ్స్ అలాట్ చేస్తాను అని చెప్పటం తో , లంచ్ కి వెళ్ళాము.లంచ్ అయినా తర్వాత రూమ్ కీస్ ఇచ్చి ,4:30 కల్లా అందరు బస్ దగ్గర ఉండాలి అని చెప్పారు. ఒక పావు గంట రెస్ట్ తీసుకుని ,స్నానాదులు కానిచ్చి అందరం బస్ దగ్గరికి వెళ్ళాము.మొదట మైసూర్ ప్యాలెస్ కి వెళ్లి ఆ తర్వాత చాముండేశ్వరి అమ్మవారిని చూడటానికి వెళ్ళాము.ప్యాలెస్ బయటనుంచి చూడటానికి పెద్ద బాగోకపోయినా (లైట్స్ లేకుండా - లైటింగ్ తో బాగానే ఉంది అనుకోండి )లోపల చాలా అద్భుతం గా ఉంది.చాముండి హిల్స్ పైకి వెళ్లేప్పుడు ,విద్యుద్దీప కాంతులతో సిటీ , ఎంతో అందం గా కనిపించింది.తప్పక చూడాల్సిన దృశ్యం. అమ్మవారిని దర్శించుకుని తిరిగి హోటల్ చేరుకున్నాము.డిన్నర్ సమయం లో మరుసటి రోజు ప్రోగ్రామ్ చెప్పారు.మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ అదీ ముగించుకుని రిసెప్షన్ దగ్గరికి చేరుకున్నాము. బస్  రావటానికి టైం పడుతుంది , రూమ్స్ కి వెళ్ళండి,బస్ వచ్చినాక పిలుస్తాము అనటం తో రూమ్ కి వెళ్ళిపోయాము.9:30 కి బయలు దేరుతాము అన్నవాళ్ళు 11, 12 గంటలు అయినా, పిలుపు లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్లు ,బస్ -రిపేర్ కి వెళ్ళింది,ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పారు.ఎలా అయితే ఏం,వేరే ఆరెంజ్మెంట్స్ చేసి కుక్కేకి బయలుదేరాము.సాయంకాలం 7:30 కి కుక్కే చేరుకున్నాము. హోటల్ నుంచి ఆటో లో గుడికి చేరుకున్నాము.  దర్శనానికి - క్యూ చాలా పెద్దగా ఉంది.క్యూ లో నించోకుండా,అక్కడ ఉన్న పూజారిగారిని అడిగి డైరెక్ట్ గా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము. మరుసటి రోజు  ప్రొద్దున్నే ఆరు గంటల కల్లా రెడీ అయ్యి ,మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. గుడి వెనక చెట్టు, కొండా , మంచులో -తడిసి ముద్దవుతూ ... చూడటానికి రెండు కళ్ళు చాలవు అనిపించింది.

              
పురాణ కథల ప్రకారం ,తారక,శూర పద్మాసుర అనే రాక్షసులను యుద్ధం లో చంపిన తర్వాత ,సుబ్రహ్మణ్య స్వామి కుమార పర్వతం చేరుకున్నాడంట.ఇంద్రుడు ఆనందంతో తన కుమార్తె దేవసేన ను వివాహం చేసుకోవాల్సింది గా కోరాడట.స్వామి పెళ్లికి అంగీకరించటం తో ,కుమార పర్వతం వద్ద పెళ్లి జరిగింది. వివాహసమయంలో   దేవతలు వివిధ పవిత్ర నదులనుంచి తెచ్చిన  జలాలతో చేసిన అభిషేకం వల్ల కుమార ధార నది ఏర్పడిందట. గుడికి కొద్ది దూరం లో కుమార ధార నది ఉంది . ఈ నది లో స్నానం చేస్తే , వ్యాధులు నయమవుతాయని   భక్తుల నమ్మకం.


 

Saturday, 3 September 2016

జనతా గారేజ్



కాన్సెప్ట్ బాగుంది కానీ తీసిన విధానం చాలా బోరింగ్ . స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే మీద ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది. ఇంటర్వెల్ వరకు ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని , ఆ తర్వాత సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది.(మధ్య మధ్య లో కొన్ని సీన్స్ exception) ప్రణామం అన్న పాట బాగుంది . పర్యావరణం ,పొల్యూషన్ గురించి మాట్లాడే హీరో , ఫ్రెండ్స్ తో కలసి అడవుల్లోకి బైక్ మీద వెళతాడు.మొక్కల్ని ప్రేమించే మనిషి ,మనుషులను భయంకరం గా కొట్టగలడా ? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కాజల్ డాన్స్ ఎందుకో తెలియదు. NTR నటన బాగుంది.ఇప్పుడు వస్తున్న రొటీన్ సినిమాలలోని హీరోకు(పబ్బుల్లో తాగి చిందులు తొక్కటం,etc)  భిన్నం గా హీరో ని చూపించినందుకు సంతోషం. 






Wednesday, 31 August 2016

భూమి గుండ్రం గా ఉంది



చిన్నప్పుడు , అమ్మమ్మ   వంట చెయ్యటానికి,ఎక్కువగా మట్టిపాత్రలే వాడేది. అల్యూమినియం పాత్రలను అప్పట్లో వంటకు మంచిది కాదు అని వాడేది కాదు. మట్టి పాత్రలలో వండిన తోటకూర పప్పు , గోంగూర పప్పు , ఉలవచారు ... వాటి రుచి కి సాటి ఇంకేదీ రాదు.కాలం తో పాటు , మట్టి పాత్రలకు కాలం చెల్లి వాటి స్థానాన్ని స్టీల్ ,నాన్స్టిక్ , గాజు పాత్రలు(అవెన్ వాడేవారైతే)ఆక్రమించాయి.మనకు ఎప్పుడూ కూడా కొత్తొక వింత , పాతొక రోత  :)

అలాగే తినే ఆహార పదార్ధాలు. మా అమ్మమ్మ చిన్నప్పుడు,జొన్నఅన్నం తినేవారంట. ఎక్కువగా ఆహారం ఆవిరి మీద ఉడికించో లేదా నిప్పుల మీద కాల్చుకుని . నూనె వాడకం చాలా తక్కువ. ఏదైనా నూనె ఉపయోగించి వండే దయితే , ఇంట్లోనే తయారు చేసిన ఆముదం వాడేవారట. వండే పాత్రలే మారిపోయినప్పుడు వంటలు మారకుండా ఉంటాయా ?ఆ మారిన వంటలు తిని తిని రోగాల పాలు పడటం ఎక్కువయ్యేప్పటికి,ఇప్పటి  జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతూంది.దాని ఫలితమే మళ్ళీ చిరుధాన్యాల వైపు కి ప్రయాణం . ఇంకా మట్టి పాత్రలు . ఏవో రోడ్డు మీద పెట్టి అమ్మే వాటిని కొనుక్కోవాలంటే చిన్నతనం కానీ, నాన్ స్టిక్ వాటితో పోటీ పడే ధర తో ఆన్ లైన్ లో దొరుకుతుంటే , ముద్దొచ్ఛే లా ఉన్న  వాటిని చూసి కొనకుండా ఉండగలమా ?








    
   

Saturday, 30 July 2016

ఓట్స్ ఇడ్లీ





పప్పు నానబెట్టుకోవటం , కడిగి రుబ్బుకోవటం లాంటి జంజాటాలు లేకుండా ,చాలా త్వరగా చేసుకునే అల్పాహారం. రుచికి రుచి .ఆరోగ్యానికి ఆరోగ్యం . ముఖ్యం గా మధుమేహం తో బాధ పడేవారికి ...  

కావాల్సిన పదార్ధాలు :

ఓట్స్  :  కప్పు

ఉప్మా రవ్వ  : 1/2 కప్పు

పెరుగు  : 1/2 కప్పు 

పచ్చి మిరప కాయలు - 2

అల్లం తురుము : 1/2 స్పూన్ 

ఉప్పు : తగినంత 

తాలింపు కి   : నూనె ,శనగ పప్పు , ఆవాలు, జీలకర్ర ,కరివేపాకు 

చేయు విధానం : 

ఓట్స్ ,రవ్వ  విడివిడిగా నూనె వెయ్యకుండా వేయించుకోవాలి . బాండీ (బాణలి ) లో నూనె వేసుకుని , వేడెక్కగానే తిరగమాత దినుసులు వేసి అందులోనే పచ్చి మిరప కాయ ముక్కలు ,అల్లం తురుము వెయ్యాలి . పెరుగు లో ఉప్పు వేసుకుని అందులో వేయించిన ఓట్స్ ,రవ్వ , తాలింపు వేసి కలుపుకోవాలి . గట్టిగా ఉంటె కొద్దిగా నీరు పోసుకుని పలుచన చెయ్యాలి . ఇడ్లి ప్లేట్స్ లో పిండి వేసి కుక్కర్ లో (విజిల్ పెట్టకూడదు )10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి . ఈ కొలతలకు 10 -12 ఇడ్లి లు తయారు అవుతాయి . కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ తో తినొచ్చు .