Wednesday, 23 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - కటీల్ ,ఉడిపి

మంగళూరుకి 29కి.మీల దూరంలో ఉన్న కటీల్ లో దుర్గాపరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు.పూర్వం , ఒకానొక కాలం లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనటం తో , జాబాలి అనే మహర్షి , యజ్ఞం చేయ తలపెట్టాడు. యజ్ఞానికి కావాల్సిన హోమధేనువు కోసం   ఇంద్రుడు వద్దకు వెళ్లగా , ఇంద్రుడు నందిని అనే ఆవును తీసుకెళ్లమని చెప్పగా , జాబాలి నందిని వద్దకు వెళ్లి భూమి కి రమ్మని కోరాడు.నందిని అందుకు అంగీకరించక పోవటంతో,కోపించి నందిని ని నది గా మారి భూమి మీద ప్రవహించమని శపించాడు.నందిని క్షమించమని వేడుకోగా, జాబాలి - శాపవిమోచనకు ఆదిశక్తిని ప్రార్ధించమని చెప్పగా,నందిని- అమ్మవారిని ప్రార్ధించిందట.దేవి,శాప విమోచనం సాధ్యం కాదని, తాను అక్కడ కొలువై ఉంటానని చెప్పారట. నందిని నది పుట్టిన స్థానానికి,సముద్రం లో కలిసే ప్రదేశానికి మధ్యలో అమ్మవారు వెలిశారు,అందుకని ఈ ప్రదేశానికి కటీలు అని పేరు . 




నందిని నది

అమ్మవారిని దర్శించుకుని , తిరిగి మంగళూరు చేరుకున్నాము. మరుసటి రోజు ప్రొద్దున్న ఉడిపి వెళ్లి , కృష్ణుడిని దర్శించుకుని , లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , సాయంకాలం Malpe బీచ్ కి వెళ్ళాము.సూర్యాస్తమయాన్ని చూసి తిరిగి బసకి   చేరుకున్నాము.కొంతమంది బీచ్ కి రాము అని చెప్పి, సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లారు.వాళ్ళు, పూజ చాలా బాగా చేశారు, దీపాలు వెలిగించి వచ్చాము ,అని చెప్పటం తో అయ్యో , అనవసరం గా బీచ్ కి వెళ్ళాము అని కొంతమంది బాధ పడ్డారు.మా టూర్ ఆపరేటర్- గోకర్ణ ,మురుడేశ్వర్ చూసి మళ్ళీ ఉడుపి వస్తాము,అప్పుడు వెళ్ళండి అని చెప్పారు.    



13వ శతాబ్దం లో మద్వాచార్యుల వారు, ఇక్కడ కృష్ణ మఠం స్థాపించారు.కనకదాస అనే భక్తుడు , కృష్ణమఠానికి ఎదురుగా ఉండేవాడు. అస్పృస్యుడు అనే కారణం తో గుడిలోకి రానివ్వని కారణం గా ,తూర్పు ముఖానికి ఉన్న విగ్రహం పశ్చిమానికి తిరిగిందట.కనకదాస పేరు మీదుగా ఈ ద్వారానికి కనకన ఖిండి అని పేరు.ఈ ద్వారం నుంచి ప్రవేశం నిషిద్ధం. ఈ ద్వారానికి ఎదురుగా కనకదాస విగ్రహం ఉంది.       





   స్వామిని నేరుగా దర్శించటానికి లేదు. ఈ కిటికీ (నవగ్రహ కిటికీ) నుంచి దర్శనం చేసుకోవాలి .


చంద్రమౌళీశ్వర ఆలయం 

 Malpe beach



బీచ్  ఎంట్రన్స్ వద్ద ... 



1 comment:

Arbinda said...

beautiful captures :) thanks for sharing dear friend Anu :) pics are providing skill n craftmanship of the era !!!