Saturday, 17 April 2010

ఇవాళ కొన్ని వందల హత్యలు చేశా

హి....హి.......హి......ఏంటి ? 'టైడ్' వాడకుండానే అవాక్కయ్యారా? ఒకటి కాదు,రెండు కాదు ,ఏకంగా వందల హత్యలు చేసానని చెప్పుకుంటున్నావు,నీకెంత దైర్యం ?అదీ ఒక్క రోజు లో!అని కూడా అనుకుంటున్నారా?మనకంత సీను లేదు లెండి.మనుషుల్ని అనుకుంటున్నారా?అబ్బే! కాదు,నేను చంపింది చీమల్ని.మా వంటింట్లో హటాత్తుగా పుట్టల కు పుట్టలు చీమలు .ఎక్కడి నుంచి వచ్చినయ్యో ,తెలి యదు.అన్ని చీమలను చూడగానే ,బెంబేలు పడి బేగాన్ స్ప్రే తో స్ప్రే చేయగానే చచ్చి పడ్డాయి.నాకు జాలి,దయ అసలు లేవు అనుకుంటున్నారా? వాటి మీద జాలి చూపిస్తే ఆ తరువాత నా మీద నేనే జాలి చూపించుకోవాల్సి వస్తుందని అలా చేసానన్న మాట.

1 comment:

kvsv said...

హా..మనసెలా వచ్చిందండీ?అన్నీ హత్యలు చేయడానికి?కుక్కల అమల లా చీమల చిట్టెమ్మా ఎవరాయినా వుంటే..అల్లరయిపోను..కరిపించుకున్నా,కుట్టించుకున్నా..వూరుకోవాలి..జీవకారుణ్య సంగం వాళ్ళు వున్నారు..జాగ్రత్త...