కొంత మంది కి ఎంతో కష్ట పడితే కాని పేరు రాదు(ఏ దైనా సాదించినం దుకు,ప్రశంసో,కొండకచోతెగడ్త అయినా కావచ్చు ).కొంతమందికి ఎక్కువ కష్టపడకుండానే పేరు వస్తుంది.కొంతమందికి అసలు ఏ మాత్రం కష్ట పడకుండానే పేరు లభిస్తుంది.చివరి కేటగిరి వారు మనకు మన ఇంట్లో మరియు ఆఫీస్ లో కూడా తారస పడతారు.మన ఇంట్లో మన అక్కో,తమ్ముడో,అన్నో,చెల్లెలో ,మన దృష్టిలో దుర్మార్గులు అయి ఉండవచ్చు.(ఎందుకంటే,మన వస్తువులు లాగేసుకుంటూ ఉంటారు,వాళ్ళ పనులు మనతో చేయించుకుంటూ ఉంటారు.(రికార్డు రాయించు కోవటం ,నోట్స్ రాయించు కోవటం,etc..) కానీ,అమ్మ,నాన్నల దృష్టిలో,మన బంధువుల దృష్టిలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు.(నోట్లో నాలుక లేని వారు,వినయవంతులు,బుద్దిమంతులు ...etc ...etc ..)వాళ్ళు ఎంత బుద్దిమంతులో మనకు మాత్రమే తెలుసు,ఎందుకంటే వాళ్ళ ప్రతాపమంతా మన దగ్గరే కదా చూపించేది.అలాగే ఆఫీస్ లో మనం ఎంతో కష్టపడుతుంటాం ,కానీ ,బాసు దగ్గర మంచి పేరు తెచ్చుకునేది మాత్రం మనం కాదు.అఫ్కోర్స్ మనకు పేరు వస్తుంది,కానీ నెగిటివ్ గా.(అసలు పని మీద శ్రద్ద లేదు,భాద్యతగా ఫీల్ అవటం లేదు etc ...etc ...)సో ...ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే,అసలు ఎవరికైతే పేరు రావాలో వాళ్ళకు రాదు,అర్హత లేకపోయినా కొంతమందికి ఆయాచితం గా పేరు లభిస్తుందని.ఇది మనుషులకే కాదు,ఊళ్లకు కూడా వర్తిస్తుంది.మా అమ్మమ్మ వాళ్ళ వూరు లో నారింజ తోటలు ఉన్నాయి.కానీ పేరు మాత్రం పక్కనే ఉన్న వడ్లపూడి కి నారింజ కు ప్రసిద్ది అనే పేరు వచ్చింది.అలాగే,మా తాతమ్మ గారి వూళ్ళో(లింగాయపాలెం) జామ తోటలు ఎక్కువ ఉన్నాయి.(ప్రస్తుతం కాదు,ఒకప్పుడు)కానీ పేరు మాత్రం రాయపూడి కి వచ్చింది.ఆవూరికి బస్సు సౌకర్యం లేదు.రాయపూడి లో దిగి నడిచి వెళ్ళాలి.బహుశా అందుకనే జామకాయలకు రాయపూడి ప్రసిద్ది చెందిందేమో!మీకూ ఇలాంటివి ఏమైనా తెలుసా?
1 comment:
Anu,
I have my part of contribution and confession,it true names often miss match with persons and places,for example we are three siblings and I am the crook but innocent stamped by mother,name and bank balance miss match,one has to careful while judgeing others.
Post a Comment